»   »  భరత్ రాజు మరణాన్ని ఆలస్యంగా గుర్తించటానికి కారణం ఏమిటి?

భరత్ రాజు మరణాన్ని ఆలస్యంగా గుర్తించటానికి కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగుగా ఔటర్ రింగ్ రోడ్డు అంటేనే ప్రాణాంతక ప్రమాదాలకు పెట్టింది పేరు. రవితేజ సోదరుడి మరణమే మొదటిసారీ కాదూ ఇదే చివరిదీ కాక పోవచ్చేమో కూడా. కానీ భరత్ రాజు మృతి విషయం లో మాత్రం కొన్ని విషయాలు చాలా అనుమానాలకు తావిచ్చాయి. వాటిల్లో మొట్టమొదటి అనుమానం శనివారం రాత్రి ప్రమాదం జరిగితే పొద్దున్న పదిగంటల వరకూ మీడియాకు ఎందుకు చేరలేదన్నదే.

ఎందుకు ఆలస్యం

ఎందుకు ఆలస్యం

ఎందుకంటే భరత్ రాజు మరీ అనామకుడేమీ కాదు, చాలా సినిమాల్లోనే చేసాడు, అందులోనూ చాలా వివాదాల్లోనూ ఇరుక్కున్న మనిషి కూడా కావటం వల్ల భరత్ ని గుర్తించటం అంతకష్టమేమీ కాదు. అందులోనూ కారు నంబర్ తో నిమిషాల్లో ఇంటి అడ్రస్ తెలుసుకోగల పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా రవితేజ కుటుంబ సభ్యులకు సమాచారం అందించటానికి ఎందుకు ఆలస్యం చేసిందీ అని అనుకున్నారు... అంత ఆలస్యం ఎందుకయ్యిందీ అంటే....

టీఎస్ 07 ఈసీ 0799

టీఎస్ 07 ఈసీ 0799

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాత్రి 10.10 నుంచి 10.25 సమయంలో శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు మీద భరత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నమ్మ హోటల్ దగ్గర ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు (టీఎస్ 07 ఈసీ 0799) బలంగా ఢీ కొంది.

నోవాటెల్ నుంచి గచ్చిబౌలి

నోవాటెల్ నుంచి గచ్చిబౌలి

శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి గచ్చిబౌలికి వెళుతున్న వేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే.. కారు నెంబరు ఆధారంగా యజమాని ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. భరత్ అమ్మ భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరిట కారు ఉండటంతో ఆమె ఎవరన్న విషయాన్ని గుర్తించటం కాస్త ఆలస్యమైంది.

రవితేజ కుటుంబ సభ్యులు

రవితేజ కుటుంబ సభ్యులు

కారు రిజిస్ట్రేషన్ లో ఉన్న అడ్రస్ ఆధారంగా వెతికిన పోలీసులకు.. ఆ ఇంట్లో రవితేజ వాళ్ళు ఉండటం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. భరత్ దుర్మరణం పాలైన విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న రవితేజ కుటుంబ సభ్యులు వెంటనే.. ఉస్మానియాకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పోలీసు వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి నుంచి రవితేజ కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి వద్దనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
The accident took place around 10 PM last night and Bharat expired on the spot itself. The dead body has been taken to Osmania hospital. The post-mortem will be completed soon and the body will be submitted to Ravi Teja family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu