‘రోమియో’కి రవితేజ డబ్బింగ్ పూర్తి
పూరి మీద ఉన్న అభిమానంతో రవితేజ ఈ సినిమా అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. 5 నిమిషాల నిడివి గల పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. పి.జి వినడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. సినిమాలో రవితేజ అలా వచ్చి వెళ్లిపోవటం కాదని, ఓ సర్పైజ్ గా ఉంటుందని చెప్తున్నారు. సినిమాలో కథను మలుపు తిప్పేదిగా ఈ గెస్ట్ పాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి 'పూరి రాసిన ప్రేమకథ' అనేది ఉపశీర్షిక. అడోనిక (పరిచయం) హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్ నిర్మిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''చరిత్రలో నిలిచిపోయిన ప్రేమజంట రోమియో- జూలియెట్. వీరు యూరప్‌లో కలిసే ప్రదేశం 'వెరోనా'. ఈ ప్రాంతంలో జరిగే ప్రేమకథే 'రోమియో. కథ, మాటలు ఇచ్చారు కాబట్టి ఉపశీర్షిక పూరి పేరు మీదే నిర్ణయించాం''అన్నారు. తనకూ పూరీ జగన్నాధ్ కి ఉన్న స్నేహంతో ఈ గెస్ట్ పాత్రను ఒప్పుకున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












