»   » ‘ఎవడో ఒకడు’...రవితేజ-దిల్ రాజు మధ్య విబేధాలు?

‘ఎవడో ఒకడు’...రవితేజ-దిల్ రాజు మధ్య విబేధాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ప్రేమం తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఎవడో ఒకడు' అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

2015 దసర పండగ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం అటకెక్కినట్లే అని అంటున్నారు. సినిమా ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా సినిమా కథ, సబ్జెక్ట్ విషయంలో రవితేజ, దిల్ రాజు మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే.....రవితేజ-దిల్ రాజు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో? లేదో? అని సందేహంగా మారింది.

Ravi Teja-Dil Raju’s film shelved?

గతంలో ఈ సినిమా గురించి దిల్ రాజు చేసిన ప్రకటన....
"రవి తేజ గారి తో భద్ర సినిమా తో సూపర్ హిట్ తీసాం. మళ్లీ ఇన్నాళ్ళకు ఆయనతో పని చేయటం, మా బ్యానర్ తో ఎంతో కాలం గా పరిచయం ఉన్న వేణు శ్రీ రామ్ తో, దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్ లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని అయన వ్యక్త పరిచారు దిల్ రాజు.

English summary
After their 2005 hit film, Bhadra, Mass Maharaja Ravi Teja and leading producer Dil Raju joined hands once again for a film titled Yevado Okadu. However, the project was getting delayed as Ravi Teja was not totally convinced with the final script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu