»   » రవితేజ 'డాన్‌ శీను' ప్రారంభం

రవితేజ 'డాన్‌ శీను' ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా మలినేని గోపీచంద్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రానున్న 'డాన్‌శీను' చిత్రం షూటింగ్‌ ఈ రోజు(సోమవారం) ప్రారంభమైంది. హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోలో ఇది మొదలైంది. ఆర్‌ ఆర్ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కె అచ్చిరెడ్డి సమర్పణలో వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవితేజ, ఎన్టీఆర్‌, రామానాయుడు, తదితరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష చేస్తోంది. మొదట ఈ చిత్రానికి హీరోగా గోపీచంద్ ని అనుకున్నారు. అలాగే అనూష్కను తీసుకున్నారు. అయితే గోపీచంద్ నో చెప్పటంతో రవితేజ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.

ఇక గతంలో దుబాయ్ శీనుగా అలరించిన రవితేజ ఈసారి డాన్ శీనుగా కనిపించనుండటంతో మంచి క్రేజ్ వచ్చింది. ఇందలో రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడని తెలుస్తోంది. అందులోనూ ఈ చిత్ర నిర్మాతలు ఆర్ ఆర్ మూవి మేకర్స్ వారు రవితేజతో ఇంతకుముందు కిక్ చిత్రాన్ని నిర్మించారు. అలాగే త్రిష గతంలో రవితేజతో సూపర్ హిట్ కృష్ణ చిత్రంలో చేసింది. కోనవెంకట్ కథ-మాటలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పనిచేసే మిగతా సాంకేతిక, తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu