»   » కొత్త డైరక్టర్ ని పరిచయం చేస్తున్న రవితేజ

కొత్త డైరక్టర్ ని పరిచయం చేస్తున్న రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొత్త దర్శకులను పరిచయం చేయటంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయన గతంలో శ్రీనువైట్ల, హరీష్ శంకర్ వంటి దర్శకులకు కెరీర్ ప్రారంభంలో సినిమాలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే రీసెంట్ గా బాబి , గోపిచంద్ మలినేని లకు కూడా సినిమాలు ఇచ్చి వారి సినిమా కెరీర్ లు ప్రారంభం అయ్యేటట్లు చేసారు. కొత్త టాలెంట్ పై ఆయనకు చాలా నమ్మకం.

అదే కోవలో ఇప్పుడు ఆయన చక్రి అనే నూతన దర్శకుడుని పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తన బలుపు, పవర్ సినిమాలకు అశోశియేట్ గా పనిచేసిన చక్రి అంటే నమ్మకంతో ఆయన సినిమా డైరక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో పూర్తి సమాచారంతో ప్రకటన రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ravi Teja introducing New director Chakri!

ఇక ఆయన తాజా చిత్రం బెంగాళ్ టైగర్ విడుదలకు సిద్దమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. సంపత్‌నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది.

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.

దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

English summary
Ravi Teja is set to work with another newcomer Chakri, who worked as associated director for Ravi Teja's movies Balupu and Power.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu