»   » ఇంకో రెండు సినిమాలు చాలు...! పాపనెవరూ ఆపలేరు

ఇంకో రెండు సినిమాలు చాలు...! పాపనెవరూ ఆపలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' అనే సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ రోజున హైదరాబాద్ లో లాంఛనంగా మొదలైంది. కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా .. ముహూర్తపు సన్నివేశాన్ని రవితేజ - మెహ్రీన్ పై చిత్రీకరించారు.

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన మెహ్రీన్, యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది. ఈ అమ్మాయి మరిన్ని ఛాన్సులు పట్టేయడం ఖాయమని చాలామంది అనుకున్నారు. మెహ్రీన్ వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

హీరోయిన్ మెహరీన్ నటించి, విడుదలైంది ఒక్క సినిమా. కృష్ణగాడి వీర ప్రేమగాథ. అయితే ప్రొడక్షన్ లో నాలుగైదు సినిమాల వరకు వున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్ ఇలా. ఇప్పుడు శర్వానంద్ పక్కన మారుతి డైరక్షన్ లో యువి సంస్థ నిర్మించే మరో సినిమాకు ఆమె డేట్లు ఫిక్సైపోయాయట.

 Ravi Teja, Mehreen Pirzada at Raja The Great movie launch

బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేజిక్కించుకొంది. ఇందులో ఒక్కటి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నిర్మించనున్నచిత్రం కూడా ఉండటం విశేషం. ఈ చిత్రాలన్ని షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకొస్తే.. ఈ అమ్మడి కెరీర్కి ఇక తిరులేనట్టే. ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న మెహ్రీన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమనే మాట ఇప్పటికే వినిపిస్తోంది.

మెహ్రీన్ పూర్తి పేరు మెహ్రీన్ పీర్ జదా మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టిన మెహ్రీన్ ఒక పక్క వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టింది డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక ఇప్ప్టికైతే అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు సిద్ధంగా వుంది. మెహ్రీన్ పుట్టింది పంజాబ్ లో పెరిగింది ఢిల్లీ లో. చదువు కెనడా లో. కెనడా లో జరిగిన మిస్ దక్షిణాసియా కనడ పోటీల్లో మిస్ పర్సనాలిటీ గా నెగ్గింది. చిన్నపుడైతే క్రాఫు ,ప్యాంటు షర్టులతో టాం బాయ్ లాగా తిరిగేదట.

English summary
Present Mehrin has offered in Que. Up to now, she selected as a lead role in the Ravi Teja, Sharwanand, Sai Dharam Tej and Sandeep Kishan movies. As per the reports, she again selected for Mega hero Varun Tej movie as a lead actress role
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu