For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: తన సమస్య బయటపెట్టిన రవితేజ.. చిరంజీవితో గ్యాప్.. ఈ సంక్రాంతి వాళ్లదంటూ షాకింగ్‌గా!

  |

  మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ అదిరిపోయే స్పీచ్‌తో అలరించాడు. ఇంతకీ అతడేం మాట్లాడాడో మీరే చూడండి!

  పంచులతో రెచ్చిపోయిన రవితేజ

  పంచులతో రెచ్చిపోయిన రవితేజ

  ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు స్టేజ్ మీదకు వచ్చిన రవితేజ 'హలో వైజాగ్.. ఇంత చలి ఉంటుందనుకోలేదయ్యా బాబూ.. బాబీ నువ్వు నా పక్కనే ఉండు. మొత్తం ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా సూపర్ హిట్.. ఛీఛీ సూపర్ హిట్టా అది చాలా చిన్న పదం. బ్లాక్ బస్టర్.. పూనకాలు లోడింగ్' అన్నాడు.

  Kajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షో

  చిరంజీవితో అప్పుడే అనుబంధం

  చిరంజీవితో అప్పుడే అనుబంధం


  ఆ తర్వాత రవితేజ 'గుంటూరు నుంచి అన్నయ్యకు ఫ్యాన్‌గా బాబీ స్టార్ అయ్యాడు. సుప్రీమ్ హీరో చిరంజీవి నుంచి ఇది మొదలైంది. నాది మొదలైంది విజయవాడ నుంచి. చిరంజీవి అన్నయ్యతో నా జర్నీ మొదలైంది విజయవాడ నుంచి. ఇందకా బాబీ ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడో.. అప్పుడు 'విజేత' మూవీ ఫంక్షన్‌లో చిరంజీవి గారికి దూరంగా ఉండి చూడలేకపోయాను. అప్పుడు ఆయన పక్కన కోదండరామిరెడ్డి గారు, భానుప్రియ గారు కూర్చున్నారు. అప్పుడు నాతో వచ్చిన వాళ్లకు చెప్పా.. ఒకరోజు నేను వెళ్లి ఆయన పక్కన కూర్చుంటా అని' అని చెప్పాడు.

  తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చింది అంటూ

  తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చింది అంటూ

  రవితేజ కంటిన్యూ చేస్తూ 'విజేత మూవీ నుంచి మొదలై ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్, ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో ఇలా. ఆయనతో ప్రతి మూమెంట్ అలాగే ఉంటుంది. విజయవాడలో చెప్పినట్లు కాకుండా ఏకంగా ఆయన చంకనెక్కి కూర్చున్నా. మధ్యలో మిమ్మల్ని తొమ్మిదేళ్లు మిస్ అయ్యాను. ఇంకెప్పుడూ అలా మిస్ కాను అన్నయ్యా' అని పేర్కొన్నాడు.

  49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

  డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం

  డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం

  ఈ వేడుకలో రవితేజ 'వాల్తేరు వీరయ్య' డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'బాబీ 'బలుపు' మూవీ సమయంలో నాకు పరిచయం అయ్యాడు. కథ చెబుతా అన్నాడు.. చెప్పాడు.. ఒప్పించాడు.. 'పవర్' చేసుకున్నాడు.. ఇప్పుడిలా ఉన్నాడు. ఈ సినిమాతో నువ్వు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోతావని నమ్ముతున్నా. ఆల్రెడీ వెళ్లిపోయావు కూడా. ఇదే కంటిన్యూ చెయ్' అన్నాడు.

  ఈ సంక్రాంతి కచ్చితంగా మీదే

  ఈ సంక్రాంతి కచ్చితంగా మీదే

  అనంతరం రవితేజ 'దేవీ శ్రీ ప్రసాద్‌తో నా కాంబినేషన్ సక్సెస్. ఏమి ఎనర్జీ అయ్య బాబోయ్. స్టేజ్ మీదకు వచ్చేద్దామనుకున్నా. ఇలాగే కుమ్మేయ్. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్. నవీన్ గారు ఏదుంటే అదే మాట్లాడతారు. ఈ సంక్రాంతి మాత్రం మీదే. ఇది సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. ఆల్రెడీ సంబరాలు కూడా మొదలైపోయాయి. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో కలుద్దాం' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  ఈవెంట్లను అలా మార్చేయాలని

  ఈవెంట్లను అలా మార్చేయాలని

  స్పీచ్ ఇస్తూనే రవితేజ యమా నవ్వించాడు. ఒక సందర్భంలో 'అన్నయ్యా.. ఈ సినిమాకు ఎలాగూ మనం చాలా ఫంక్షన్లు చేసుకుంటాం. ఈసారి ఏం చేద్దాం అంటే.. ముందు మనమే మాట్లాడేద్దాం. ఎందుకంటే నాకున్న మెమొరీ పవర్‌కు అన్నీ మర్చిపోతున్నా. ఎన్నో అనుకున్నా బుర్రలో నుంచి పోతున్నాయి' అంటూ చిరంజీవితో చెప్పడం అందరినీ నవ్వించేసింది.

  చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన హీరో

  చిరంజీవి సీక్రెట్ లీక్ చేసిన హీరో


  రవితేజ కొనసాగిస్తూ 'అన్నయ్య ఎంత మంచోళ్లు అంటే.. అవతలి వాళ్లను ఏమీ అనకూడదు. ఎదుటి వాళ్లు ఏమన్నా భరిస్తారు. బాధ పడతారేమో కానీ, బయట మాత్రం పడరు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. నేను ఆయనకు పరిచయం అయిన తర్వాత ఏ ఒక్కరి గురించీ నెగెటివ్‌గా మాట్లాడడం మాత్రం నేను అస్సలు వినలేదు. ఐలవ్యూ అన్నయ్యా' అని ప్రేమను చూపించాడు.

  జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

  వాళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన స్టార్

  వాళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన స్టార్

  స్పీచ్ ఇవ్వడ అయిపోయిన తర్వాత యాంకర్ సుమ.. బాబీ, రవితేజ గారు డ్యాన్స్ చేయాలని కోరింది. అంతేకాదు, ఆ వెంటనే శేఖర్ మాస్టర్, దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా పిలిచింది. దీంతో వీళ్లంతా కలిసి పూనకాలు లోడింగ్ పాటకు స్టెప్పులేశారు. అనంతరం రవితేజ.. శేఖర్ మాస్టర్ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని చెబుతూ.. తన స్పీచ్‌ను ముగించి స్టేజ్ దిగిపోయాడు.

  English summary
  Waltair Veerayya Movie Unit Conducts Pre Release Event At AU Grounds. Lets See Mass Maharaja Ravi Tej Speech at this Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X