»   » చిరంజీవిని మరిచిపోవాలా! పూరి ‘ఆటో జానీ’ ట్విస్ట్!

చిరంజీవిని మరిచిపోవాలా! పూరి ‘ఆటో జానీ’ ట్విస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో చిరంజీవి 150వ సినిమా పూరి దర్శకత్వంలో ఖరారైంది. ‘ఆటో జానీ' టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ సూపర్ అంటూ హ్యాపీ అయ్యారు. ‘ఆటో జానీ'గా చిరంజీవిని ఊహించుకున్నారు. అయితే ఉన్నట్టుండి చిరంజీవి పూరితో 150వ సినిమా చేయడానికి నో చెప్పారు. ఇదంతా గతం....

అయితే చిరంజీవి తప్పుకున్నా ‘ఆటో జానీ' మూవీని తెరకెక్కించే ప్రయత్నం మాత్రం మానుకోలేదు పూరి. చిరంజీవి లేక పోయినా....తన పని తాను చేసుకుపోతానంటున్నాడు. మరో సార్ తో ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మధ్యే పూరి చెప్పిన ఆటోజాని స్టోరీ విన్న రవితేజ.. వెంటనే ఆ సినిమా చేయడానికి అంగీకరించినట్లు టాక్. చిరంజీవి అంత కాక పోయినా.... ‘ఆటో జానీ' స్టోరీకి రవితేజ కూడా బాగానే సూటవుతాడు అనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇకపై ఆటోజానీగా చిరంజీవిని ఊహించుకోవడం మానేసి రవితేజను ఊహించుకోవాలన్నమాట.

వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ మూవీ...
చిరంజీవి 150వ సినిమా గురించి రామ్ చరణ్ ఇటీవల ఫిల్మీబీట్ స్పెషల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు.

Ravi Teja in Puri Jagannadh's Auto Johnny

చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ తెలుగులో కనిపించే రోటీన్ విలన్ కాకుండా డిపరెంటుగా ప్లాన్ చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తెలుగులో రక్త చరిత్ర సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన వివేక్ ఒబెరాయ్... బాలీవుడ్లో ‘క్రిష్-3' మూవీలోనూ విలన్ గా పవర్ ఫుల్ గా నటించాడు. ఈనేపథ్యంలో అతడే చిరంజీవి సినిమాలో విలన్ పాత్రకు అయితే బావుంటుందని వివి వినాయక్ భావించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఇటీవల స్వయంగా వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి ఈ విషయమై అడిగారని, ఏకంగా చిరంజీవి నుండి కాల్ రావడంతో వివేక్ ఒబెరాయ్ ఫుల్ ఎగ్జైట్మెంటులో ఉన్నారని, వెంటనే ఒకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రానుంది.

చిరంజీవి 150వ సినిమాను జనవరి, 2016లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సురేఖ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఠాగూర్ మధు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు.

English summary
Bengal Tiger was an average hit to Ravi Teja as it was expected to be big hit at the box office. Ravi Teja is getting even more offers after the Bengal Tiger average hit. In this context, Ravi Teja is interested in Puri Jagannadh’s Auto Johnny movie which is rejected by Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu