Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేపటి నుండే రవితేజ కొత్త చిత్రం
హైదరాబాద్: రవితేజ కొత్త చిత్రం రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించబోయే ‘బెంగాల్ టైగర్' సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘కిక్ 2′ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రవితేజ, తమన్నా జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మించే చిత్రానికి ‘బెంగాల్ టైగర్' అనే పేరుని ఖరారు చేశారు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘కిక్ 2' చిత్రం పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ‘ ఇంతకుముందు ‘ఏమైంది ఈ వేళ', ‘అధినేత', ‘ప్యార్ మే పడిపోయానే' చిత్రాలను నిర్మించిన నాకు రవితేజగారు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాం. సంపత్‌నంది చెప్పిన కథ అన్నివర్గాల వారినీ ఆకట్టుకొనే విధంగా ఉంది. కథకు తగ్గట్లు ‘బెంగాల్ టైగర్' అనే పవర్‌ఫుల్ టైటిల్ నిర్ణయించాం. టైటిల్‌కు తగ్గట్లుగానే హీరో కేరెక్టరైజేషన్ డిజైన్ చేశాం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు.

‘బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి రవితేజతో జోడి కడుతున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల సమాచారం.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రవితేజ మాట్లాడుతూ ''సంపత్ నంది చెప్పిన కథ చాలా బాగుంది. ఒక్కసారి వినగానే ఓకే చెప్పేశా. అన్ని వర్గాల్నీ అలరించే అంశాలున్నాయి. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా సంపత్ నంది కథని తీర్చిదిద్దుతున్నాడు''అన్నారు.
''రవితేజతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాము''అన్నారు సంపత్ నంది.