»   » ఇప్పుడు రవితేజకు కూడా అఖిల్ సినిమానే సమస్య

ఇప్పుడు రవితేజకు కూడా అఖిల్ సినిమానే సమస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దానికి కారణం ‘అఖిల్' చిత్రం అని నిర్మాత తెలియచేసారు. అలాగే నిఖిల్ తాజా చిత్రం శంకరాభరణం కూడా అఖిల్ చిత్రం విడుదల తేదీ పైనే డెషిషన్ తీసుకుని ఈ నెల 20 తేదీకు విడుదల తేదీని ప్లాన్ చేసుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ... "మా 'బెంగాల్‌ టైగర్‌' విడుదల వాయిదా వేయటానికి కారణం ..అఖిల్ చిత్రం. అఖిల్, బెంగాళ్ టైగర్ చిత్రాల రెండిటి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఒకరే తీసుకోవటంతో రెండు చిత్రాల మధ్యా గ్యాప్ కోసం వాయిదా వేసాం. కాబట్టి అఖిల్ చిత్రం విడుదలపై మా చిత్రం రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. ," అని తెలియచేసారు.

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.

Ravi Teja's Bengal Tiger producer’s clarification.

దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు. సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.

ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజాను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా. త‌మ‌న్న త‌న అంద‌చందాల‌తో మురిపించ‌బోతోంది. రాశిఖన్నా రెండో హిరోయిన్ గా నటించింది.

English summary
“The delay is not because of my film, it is because of Akhil’s debut film. Both films’ distribution rights have been bought by the same person and hence, they want to release the two films with a gap. So it all depends on Akhil’s film release,” says Bengal Tiger producer Radhamohan.
Please Wait while comments are loading...