»   » డిసప్పాయింట్: రవితేజ ‘కిక్-2’ సెన్సార్ రిపోర్ట్

డిసప్పాయింట్: రవితేజ ‘కిక్-2’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిక్-2' మూవీ వాదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి 'A' సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తోంది.

అయితే సినిమాకు 'A' సర్టిఫికెట్ రావడంపై దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'A' సర్టిఫికెట్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపి కొన్ని కట్స్ భరించైనా సరే ‘U/A' సర్టిఫికెట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


Ravi Teja’s Kick 2 censor report

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి థీమ్ సాంగ్ ని హైద‌రాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ లో 120 మంది డాన్స‌ర్స్ తో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ పై చిత్రంలో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ గా చిత్రీక‌రిస్తున్నారు . ఈ సాంగ్ కోసం హీరోయిన్ హంస‌నందిని మాస్‌మ‌హ‌రాజ్ తో స్టెప్స్ వేస్తుంది.


ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించారు. బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం, భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

English summary
Raviteja’s Kick 2 is all set to hit the screens on August 21st, 2015. The latest update is that this movie received ‘A’ certificate from the censor board officials.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu