For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ సూపర్ హిట్ రీమేక్ బడ్జెట్ 150 కోట్లు

  By Srikanya
  |

  ఢిల్లీ : మాస్ మహారాజా రవితేజ తో సురేంద్రరెడ్డి రూపొందించిన చిత్రం 'కిక్‌'. తెలుగులో విజయవంతమైన చిత్రం 'కిక్‌' హిందీ రీమేక్‌లో సల్మాన్‌ నటించనున్నాడు. ఇదే పేరుతో హిందీ భాషలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాత. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో, ఉత్కంఠ రేకెత్తించే పోరాట సన్నివేశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో లండన్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది.

  తెలుగులో రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్లుగా వెండితెరకెక్కిన 'కిక్‌' చిత్రం వూహించని మలుపులతో వినోదాత్మకంగా సాగిపోగిపోతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్‌ ప్రేక్షకులు మెచ్చే విధంగా, సల్మాన్‌ ఇమేజ్‌కు నప్పే విధంగా స్క్రిప్టులో మార్పులు, చేర్పులు చేసే బాధ్యత ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌కు అప్పగించారు. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన హెయిల్ స్టైయిల్ ని సైతం డిజైన్ చేసారు. ఆ హెయిల్ స్టైల్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్‌బాస్‌ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా కనిపించిన ఈయన తలపై జుట్టు ఉందా లేదా అన్నంత కురచని హెయిర్‌ స్త్టెల్‌తో మిలిటరీ కట్‌తో దర్శనమిచ్చాడు. ఆ హెయిల్ స్టైల్ కిక్ లో వాడనున్నారు.

  వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీసును బద్దలుకొడుతూ సినీ వినీలాకాశంలో వెలుగుతున్న హీరో సల్మాన్‌ ఖాన్‌. ఏ చిత్రమైనా ఎంతో వైవిధ్యంగా ఉండేలా ఎంపిక చేసుకుంటూ తనలోని నటుడిని సంతృప్తి పర్చుకుంటాడు. దాంతోపాటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సల్లూ భాయ్‌ ఖాన్‌ల త్రయంలో (అమీర్‌, షారూఖ్‌) చిత్రాల సంఖ్యలోనూ, వసూళ్ల వంటి విషయాల్లోనూ ముందువరుసలో ఉన్నాడు. ప్రతి చిత్రంలోనూ ఆయన మార్చే హెయిర్‌ స్త్టెల్స్‌ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. ఆయన మరో సినిమాతో తెరపై కనిపించే వరకు అదేతరహా కేశాలంకరణ ఫ్యాషన్‌గా చెలామణి అవుతుంది.

  ఆయన నటించిన 'మైనే ప్యార్‌ కియా' నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న 'దబాంగ్‌-2' వరకు పలురకాల హెయిర్‌ స్త్టెల్స్‌లో సల్మాన్‌ కనిపించడం చెప్పుకోదగ్గ విషయం. గత దశాబ్ధ కాలంగా సల్మాన్‌ ఖాన్‌కు కేశాలంకరణ నిపుణుడిగా పనిచేస్తున్న ఆలిమ్‌ హమిక్‌కే ఈ ఘనత దక్కుతుంది. 'మైనే ప్యార్‌కియా', 'సాజన్‌' వంటి చిత్రాల్లో పీలగా కనిపించే సల్మాన్‌ పొడవైన జుత్తుతో కనిపిస్తే ఆరు పలకల దేహంతో 'ముఝసే షాదీ కరోగీ' అంటూ ప్రియాంక చోప్రా వెంట పడే పాత్రలో ఆధునిక కేశాంకరణతో, 'తేరే నామ్‌'లో పాపిట మధ్యలో అటూ ఇటూగా విడిపోయిన జుట్టుతో, ఒకసారి గుండుతో మరోసారి, బంగారు వర్ణంలో మెరిసే వెంట్రుకలతో 'యువరాజ్‌'గానూ, హుందాగా కనిపించే తలకట్టుతో 'పార్టనర్‌' చిత్రంలో లవ్‌గురుగానూ ఈయన పలు అవతారాల్లో కనిపించాడు.

  English summary
  Salman Khan’s New Hair Style Is Reported Are Be His New Look For His Upcoming Biggie, Kick Which Will Be Releases In Next Year Producer Sajid Nadiadwala. KICK The Film Which Sajid Will Start Shooting In London With Salman Khan According To News. Is Said To Be Most Expensive Production, With A Rumored Budget Of Over Rs. 150 Cr. KICK Is Remake Movie Of Telegu Film, Which Was Blockbuster. In This Film Salman Will See Gutsy Guy Who Will Play Lots Of Stunts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X