»   » బస్‌పాస్‌ కాదు... వాడేసుకోవడానికి‌: రవితేజ

బస్‌పాస్‌ కాదు... వాడేసుకోవడానికి‌: రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ‌: మాస్‌ అంటే బస్‌పాస్‌ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్‌ బట్టి జనం పిలుచుకునే పిలుపు అంటున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'పవర్‌'. కె.ఎస్‌.రవీంద్రనాధ్‌ (బాబి) దర్శకుడు. హన్సిక హీరోయిన్. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా 'పవర్‌' ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో డైలాగు ఇది. ఈ డైలాగు ఇప్పటికే అందరిలో నానుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ ''పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి కథ ఇది. ఈ టైటిల్‌ రవితేజకు నూటికి నూరుపాళ్లూ సరిపోతుంది. ఫిబ్రవరి 16 వరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతాం. కోల్‌కత, నాగ్‌పూర్‌లలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary
Power is the film is about a police officer who uses his power as his weapon. The story and the title are aptly suited for the image and body language of Ravi Teja, director K S Ravindra informed the media. Hansika is the heroine. S S Thaman is scoring the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu