»   » హ్యాపీ బర్త్ డే రవితేజ (‘పవర్’ న్యూ స్టిల్స్)

హ్యాపీ బర్త్ డే రవితేజ (‘పవర్’ న్యూ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తానేంటో ఎప్పుడో నిరుపించుకున్నారు. వయసు 45 ఏళ్లయినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీపడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడతారు.

1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'సింధూరం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు.

ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లు ఇద్దరూ ఇష్ట పడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్ర, విక్రమాక్కుడు, దుబాయ్ శ్రీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు చిత్రాలతో రవితేజ తన పరంపరను కొనసాగిస్తున్నారు.

స్లైడ్ షోలో రవితేజ తాజా సినిమా 'పవర్' మూవీ న్యూ స్టిల్స్, వివరాలు....

రెస్పాన్స్ కేక

రెస్పాన్స్ కేక

ఓ వైపు రిపబ్లిక్ డే, అదే రోజు రవితేజ బర్త్ డే పురస్కరించుకుని ఆయన తాజా సినిమా ‘పవర్' ఫస్ట్ లుక్ విడుదల చేసారు. మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న రవితేజ ఈచిత్రంలో అందుకు ఏ మాత్రం తగ్గకుండా కనిపించడం, సినిమా టైటిల్ కూడా ఫుల్ మాస్‌గా ఉండటంతో రెస్పాన్స్ అదిరిపోతోంది.

ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో..

ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో..

ఇటీవలే ‘బలుపు' చిత్రంతో మాస్ మసాలా హిట్ కొట్టిన రవితేజ ఈచిత్రంతో కూడా మరో విజయం అందుకోవడం ఖాయమని అంటున్నారు అభిమానులు. ‘పవర్' మూవీ పోస్టర్ చూస్తుంటే ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.రవితేజ నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పవర్

పవర్

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీనచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక విభాగం

నటీనటులు, సాంకేతిక విభాగం

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్,ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary
Ravi Teja's 'Power' new stills has been released on the occasion of the actor's birthday. Directed by Bobby (KS Ravindranath), Power is tipped to be a mass entertainer that has Ravi Teja essaying the role of a cop.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu