»   »  ఫోటో వైరల్: తమ్మడు మరణం తర్వాత రవితేజ సెల్పీపై వివాదం?

ఫోటో వైరల్: తమ్మడు మరణం తర్వాత రవితేజ సెల్పీపై వివాదం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే తమ్ముడిని చివరి చూపు కూడా చూడటానికి రవితేజ ఇష్టపడలేదు. రవితేజ మాత్రమే కాదు, వాళ్ల అమ్మ, ఇతర కుటుంబ సభ్యులెవరూ రాలేదు. మరో సోదరుడు రఘు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి.

ఈ తరుణంలో.... రవితేజకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో మరో వివాదానికి కారణమైంది. 'రాజా ది గ్రేట్' సినిమా యూనిట్ సభ్యులతో కలిసి రవితేజ ఎంతో సంతోషంగా సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ఆ ఫోటోను చూసిన వారంతా..... తమ్ముడు పోయినా... రవితేజ ఎంత ఆనందంగా ఉన్నాడో? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఫోటో ఎప్పుడు తీశారు?

ఫోటో ఎప్పుడు తీశారు?

మరి ఈ ఫోటో భరత్ మరణానికి ముందు తీసిందా? లేక భరత్ మరణం తర్వాత తీసిందా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి తమ్ముడి విషయంలో రవితేజ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో? తెలియదు కానీ బయట రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

అంతు చిక్కని మిస్టరీ

అంతు చిక్కని మిస్టరీ

రవితేజ, ఆయన కుటుంబం... భరత్ చివరి చూపు చూడటానికి ఎందుకు ఇష్టపడలేదు, ఈ పరిణామాల వెనక కారణాలే ఏమిటీ అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ విషయంపై పరిశ్రమకు చెందిన వారు కూడా మాట్లాడటానికి ఇష్టపడక పోవడంతో ఇదో అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

షూటింగుకు హాజరైన రవితేజ, డైరెక్టర్ షాక్

షూటింగుకు హాజరైన రవితేజ, డైరెక్టర్ షాక్

ఓ వైపు తమ్ముడి విషాదం... మరో వైపు షూటింగుకు హాజరైన రవితేజ. వినడానికే కాస్త వింతగా ఉంది కదూ. తమ్ముడి మరణంతో రవితేజ షూటింగుకు వచ్చే అవకాశం లేదని భావించి.... వాయిదా వేసేందుకు ప్లాన్ చేసిన దర్శకుడికి రవితేజ షాక్ ఇచ్చాడట.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లేపుకొస్తే నేనే పెళ్లి చేశా..... రవితేజ తమ్ముడు భరత్ గురించి పోసాని!

లేపుకొస్తే నేనే పెళ్లి చేశా..... రవితేజ తమ్ముడు భరత్ గురించి పోసాని!

లేపుకొస్తే నేనే పెళ్లి చేశా..... రవితేజ తమ్ముడు భరత్ గురించి పోసాని కృష్ణ మరళి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood actor Ravi Teja selfie pic goes viral after Bharat death. Ravi Teja was not present at the funeral of brother Bharat who died in a car crash in Hyderabad. The only family member who attended the funeral of the 46-year-old actor was their younger brother Raghu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu