తెరమీదకి మాస్ యువరాజు: రాజా ద గ్రేట్ లో రవితేజ కొడుకు??
రాజా ద గ్రేట్ సినిమా ద్వారా రవితేజ తనయుడు 'మహాధన్' పరిచయమవుతున్నాడు. ఇందులో చిన్నప్పటి రవితేజగా మహాధన్ కనిపించనున్నాడట.
మాస్ మహారాజ్ గా టాలీవుడ్ లో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ లేటెస్ట్ గా రెండు సినిమాలకు ఓకే చెప్పాడు.ఒకటి ' రాజా ది గ్రేట్', మరొకటి "టచ్ చేసి చూడు"? ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ మొదలైంది. గత ఏడాది రవితేజ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. 'బెంగాల్ టైగర్' తరువాత గ్యాప్ తీసుకున్న రవితేజ మళ్ళీ కొత్త ఉత్సహంతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ సినిమా ద్వారా రవితేజ తనయుడు 'మహాధన్' పరిచయమవుతుండటం విశేషం. ఇందులో చిన్నప్పటి రవితేజగా మహాధన్ కనిపించనున్నాడట. రవితేజ తన ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్స్ కి వెళ్లే సందర్భాలు చాలా తక్కువ. అందువలన ఆయన పిల్లల గురించి చాలామందికి తెలియదు. అలాంటిది రవితేజ ఒక్కసారిగా తన తనయుడిని వెండితెర ద్వారా పరిచయం చేస్తుండటం విశేషం. భవిష్యత్తులో ఈ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.



Click it and Unblock the Notifications











