»   » మిరపకాయ్ కంటే ఘాటుగా, స్పీడుగా మే 20న రవితేజ 'వీర'...?

మిరపకాయ్ కంటే ఘాటుగా, స్పీడుగా మే 20న రవితేజ 'వీర'...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా కాజల్, తాప్సి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'వీర'. ప్రస్తుతం స్విట్జార్లాండ్ లో రవితేజ, కాజల్ కాంబినేషన్ లో పాటల చిత్రీకరణలో నిమగ్నమై ఉంది ఈ సినిమా యూనిట్. మరోవైపు ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ వేగానికి కారణం మే 20న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికే.. అనే వార్తలు వినపడుతున్నాయి.

అలాగే ట్రేడ్ పండితుల విశ్లేషణలు కూడా ఈ వార్తకు అనుగుణంగానే ఉన్నాయి. మే నెలలో విడుదల కావలసిన భారి చిత్రాలలో 'వీర'కూడా ఒకటి. ఇంకా పాటలు షూటింగ్ పూర్తి కాలేదు కాబట్టి సినిమాను మొదటి, రెండో వారాలలో తీసుకువచ్చే అవకాశాలు లేవు. అలా అని చివరి వారం వరుకు ఆగితే బద్రీనాథ్ నుండి పోటి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అది కాకుండా మరికొంతకాలం ఆగితే వేసవి సెలవులు అయిపోతాయి. ఈ సంవత్సరం సంక్రాంతి హీరోగా నిలిచిన రవితేజ వేసవి సెలవులను కూడా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అందువల్ల ఈ కారణలన్నిటిని దృష్టిలో పెట్టుకుని సినిమాను మే మూడోవారంలో విడుదల చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు అని సమాచారం. రవితేజ రెండు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'హోలీ 2 టాలీ' బ్యానర్ ఫై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నాడు. రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

English summary
Mass Maharaja Ravi Teja who was riding high with the success of his recent movie Mirapakaya is now gearing up to arrive with another one. This one has been titled as Veera and sources say the film is hitting the screens on May 20th. Currently, the canning of the songs is on at Switzerland and Ravi Teja is flanked by the saucy seductress Kajal Agarwal and the milky thigh beauty Tapsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu