»   » రవితేజ కిక్-2 విడుదల మరింత ఆలస్యం, ఏమైంది?

రవితేజ కిక్-2 విడుదల మరింత ఆలస్యం, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమా ‘కిక్-2'. ఈ చిత్ర మే నెలాఖరులోనే నందమూరి సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితి చూస్తే సినిమా విడుదల ఇపుడు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. పోస్టు ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదల జూన్ నెలకు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రవితేజ మార్కు ఎంటర్టెన్మెంట్, సురేందర్ రెడ్డి మార్కు స్క్రీన్ ప్లేతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.


Raviteja’s Kick 2 release date postponed

ఈ సినిమా కు రన్ టైమ్ ప్రాబ్లం వచ్చిందని సమాచారం. 3 గంటలు పైగా సినిమా వచ్చిందని, అయితే అంత రన్ టైమ్ థియోటర్స్ లో వర్కవుట్ కావటంలేదని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చెప్తున్న నేపధ్యంలో దాని లెంగ్త్ తగ్గించాలని ఎడిటర్ గౌతమ్ రాజు కృషి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతీ సీన్...కీలకమైందిగా ఉందని దాంతో ఏ సీన్ ఎడిట్ చేసి లెంగ్త్ తీసేయాలనే సందిగ్దంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.


ఈ సినిమాపై భారీ అంచనలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే ఓ బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని వరు సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు పలకడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Mass Maharaja Raviteja’s forthcoming film ‘Kick 2’ is supposed to hit the screens in the month of May. But, it got postponed due to some incomplete post production work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu