For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ తన కొడుకుతో కలిసి సెల్ఫీ(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ :హీరో రవితేజ తన కుటుంబానికి తగిన సమయం కేటాయించి చాలా హ్యాపీగా గడుపుతూంటారు. ఆయన తన కొడుకు మాధవన్ తో కలిసి సర్ఫైజింగ్ గా ఈ ఫొటోని అఫీషియల్ గా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు. రవితేజ..చాలా కాలం క్రితం కళ్యాణి ని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె మోక్షద, కుమారుడు మాధవన్ భూపతి రాజు ఉన్నారు. పాప..తొమ్మిదవ తరగతి చదువుతోంది. కుమారుడు ఐదవ తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరూ రవితేజకు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడ రవితేజ తన కొడుకుతో దిగిన ఫొటో చూడవచ్చు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తానేంటో ఎప్పుడో నిరుపించుకున్నారు. వయసు 46 ఏళ్లు దాటినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీపడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడతారు.

   Raviteja with son Mahadhan

  1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు.

  ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లు ఇద్దరూ ఇష్ట పడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్ర, విక్రమాక్కుడు, దుబాయ్ శ్రీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు, పవర్ చిత్రాలతో రవితేజ తన పరంపరను కొనసాగిస్తున్నారు.

  రవితేజ చిత్రాల విషయాలకి వస్తే..

  మొత్తానికి హిందీలో మంచి విజయం సాధించిన 'స్పెషల్‌ ఛబ్బీస్‌' చిత్రం తెలుగు రీమేక్ కు రంగం సిద్దమైంది. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్, మిరపకాయ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మిరపకాయ చిత్రం మంచి విజయం సాధించి హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చే దిసగా కెరీర్ ని నడిపించింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'స్పెషల్ చబ్బీస్' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో పునర్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  1987లో సీబీఐ అధికారుల ముసుగులో ఓ బృందం ముంబైలోని బంగారు దుకాణాన్ని పూర్తిగా దోచేసుకుంది. ఆ సంఘటన ఆధారంగానే రెండేళ్ళ క్రితం అక్షయ్ కుమార్ 'స్పెషల్ చబ్బీస్' మూవీ తెరకెక్కింది. రవితేజతో 'భద్ర' వంటి సూపర్ హిట్ ను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడీ హిందీ సినిమాను అతనితోనే రీమేక్ చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది.

  అక్షయ్‌ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. 'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.

  మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

  English summary
  Hero Raviteja surprisingly yesterday he shared picture of his son Mahadhan officially.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X