»   » అనుష్క కోసం రియల్ గోల్డ్ తెప్పించిన దర్శకుడు

అనుష్క కోసం రియల్ గోల్డ్ తెప్పించిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది. దర్శకుడు గుణశేఖర్ తన సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో కళ్లు చెదిరే సెట్లు వేయడంతో పాటు.....చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కాస్టూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక సినిమాకు ప్రధాన పాత్రదారి అయిన అనుష్క కాస్టూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసకుంటున్నారు. ఈచిత్రంలో అనుష్క ధరించే కిరీటం, ఆభరణాలు నిజమైన బంగారంతో చేయించారు. వీటిని చెన్నైలో ప్రత్యేకంగా తయీరు చేయించి తీసుకొచ్చారట.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు....

అనుష్క

అనుష్క


గుణా టీం వర్క్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రంగా రాబోతోంది. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క నటిస్తోంది.

రానా

రానా


చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్ తదితరులు నటిస్తున్నారు.

ఇతర పాత్రలు

ఇతర పాత్రలు


మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary

 Anushka will be seen as the warrior queen Rudhrama Devi in the film and extensive research has gone into the making of her costumes and ornaments. Art director Thota Tharani has recreated these costumes and ornaments with the help of ancient texts and writings.
 To get an authentic feel, real gold has been used for Anushka’s crown and other ornaments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu