ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తా.. నా బిగ్గెస్ట్ డ్రీమ్ అదే: సోనూసూద్

కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి కూడా రాజకీయనాయకుల కంటే వేగంగా ప్రభుత్వాల కంటే తొందరగా స్పందిస్తూ సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎలాంటి సహాయం అడిగినా కూడా కాదనకుండా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా తన సహాయలు ఏ మాత్రం ఆగవని సోనూసూద్ ఇప్పటికే బలమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశాడు. అయితే ఇటీవల తన డ్రీమ్ ఏమిటనే దానిపై కూడా సోనూసూద్ క్లారిటీ ఇచ్చేశాడు.

అప్పటి నుంచి మొదలైన సహాయలు

అప్పటి నుంచి మొదలైన సహాయలు

గత ఏడాది కరోనా వైరస్ మొదలైనప్పుడు లాక్ డౌన్ విధించగానే ఎంతోమంది వలసదారులు సొంత ఊళ్లకు వెళ్ళడానికి నానా కష్టాలు పడ్డారు. ఎలాంటి సపోర్ట్ లేని క్రమంలో చాలామంది వందల కిలోమీటర్లు నడవడానికి సిద్ధమయ్యారు. వారి కష్టం గురించి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే వారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాట్లు చేసి ఇళ్లకు పంపాడు.

ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ..

ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ..

ఏ మాత్రం గ్యాప్ లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు సోనూసూద్ సహాయలను కొనసాగిస్తూనే ఉన్నాడు. రైతులకు అలాగే అనాధలకు కూడా అండగా ఉంటున్నాడు. పేద విద్యార్థులకు కూడా చదువుకునేందుకు ప్రత్యేకంగా సహాయలు అందిస్తున్నాడు. ఆర్థికంగానే కాకుండా వైద్యపరంగా కూడా అడిగిన వారికి అండగా నిలుస్తున్నారు.

నా కోరిక అదే

నా కోరిక అదే

ఇక సోనూసూద్ తన చిరకాల కోరిక గురించి మొదటిసారి బయటపెట్టాడు. ఇంతవరకు చేసింది చాలా తక్కువ అంటూ భవిష్యత్తులో చేయాల్సింది ఇంకా ఉందని చెప్పారు. తన తుది శ్వాస వరకు కూడా ఇలానే సహాయం చేస్తానని చెబుతూ.. ఎప్పటికైనా సరే పేదవారికి ఉచితంగా వైద్యం అందాలన్నది నా కోరిక. అదే విధంగా ప్రతి పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Filmibeat Telugu
అంత సులభం కాదని నాకు తెలుసు.

అంత సులభం కాదని నాకు తెలుసు.

'నేను అనుకున్నది చేయడం అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ ఎప్పటికైనా దాన్ని నిజం చేయాలన్నది నా డ్రీమ్' అంటూ సోనూసూద్ వివరణ ఇచ్చారు. మరి ఆ కలను సోనూసూద్ ఎప్పటికి అందుకుంటాడో చూడాలి. ఇక సోనూసూద్ రాజకీయాలపై ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని నటుడిగా కూడా తాను ఇంకా కొన్నేళ్లు కొనసాగాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X