పూరి కొడుకు ప్రేమ కథలో రియల్ లైఫ్ జంట!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా చిత్రం చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే మెహబాబా చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో జరిగే ఉత్కంఠ భరితమైన ప్రేమ కథగా దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందాల తార నేహా శెట్టి ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెహబూబా చిత్రంలో రియల్ లైఫ్ జంట నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళి శర్మ భార్య అశ్విని కశ్లేఖర్ ఈ చిత్రంలో కూడా మురళి శర్మ భార్య గానే నటిస్తున్నారట. అశ్విని కశ్లేఖర్ హిందీ సీరియల్స్ లో ప్రధాన నటిగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అశ్విని పలు చిత్రాల్లో కూడా నటించారు.


Click it and Unblock the Notifications











