»   » పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో రెబల్ స్టార్ ...

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో రెబల్ స్టార్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ చిత్రం 'దబాంగ్" రీమేక్ 'గబ్బర్ సింగ్"లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ తండ్రిగా రెబల్ స్టార్ కృష్ణంరాజుని నటింపజేయాలని అనుకుంటున్నారట. హిందీలో ఈ పాత్రను వినోద్ ఖన్నా సల్మాన్ ఖాన్ ఫాదర్ గా చేశారు. అలాగే జయసుధను మదర్ గా కన్సిడర్ చేశారనే వార్తలు వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే కృష్ణంరాజు రేంజ్ కి తగ్గ పాత్ర కాకపోయినా ఈ కథ ఈ పాత్ర ద్వారా మంచి మలుపు తీసుకుంటుందట. కీలక పాత్ర కాబట్టి కృష్ణంరాజుని తీసుకోవాలనుకుంటున్నారట. కాగా శ్రీకాంత్ పవన్ బ్రదర్ గా సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరపకాయ్" హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా త్వరలో ఆరంభం కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu