రెబల్ స్టార్ డైరెక్షన్ లో ఓ సినిమా..!
వందలాది చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి రెబెల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణంరాజు ఇప్పుడు దర్శకుడిగా కూడా మారుతున్నారు. తమ గోపీకృష్ణా కంబైన్స్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ప్రస్తుతం దగ్గరుండి చేయించుకుంటున్నారు. ఇది భక్తిరస ప్రధాన చిత్రంగా ఉంటుందని అంటున్నారు.
ప్రభాస్ హీరోగా 'బిల్లా" సినిమాని నిర్మించి, ఆ సినిమాలో తానూ నటించిన కృష్ణంరాజు, నటనపై తనకు ఆసక్తి తగ్గిందని ఈ మధ్యనే ఓ సందర్భంలో చెప్పినా, మళ్ళీ తన డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం మొహానికి మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆయనతో బాటు ఇందులో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. వచ్చే ఆగష్టు నుంచి ఇది ప్రారంభం అవుతుందట. నటుడిగా తనదైన ముద్ర వేసిన రెబెల్ స్టార్ దర్శకుడిగా కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











