»   » అమ్మను కోల్పోయిన హీరోలు.. రీమా లాగూ నటించిన అద్భుత చిత్రాలివే..

అమ్మను కోల్పోయిన హీరోలు.. రీమా లాగూ నటించిన అద్భుత చిత్రాలివే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో తల్లి పాత్రలకు నటి రీమాలాగూ పెట్టింది పేరు. వేదన, విషాదకరమైన పాత్రలను పండించడంలో వెండితెరమీద ఆమెకు ఎవరూ సాటి రారు. రీమా లాగూ ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమ మూగపోయింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు అమితాబ్, తదితరలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రీమా లాగూ నటించిన చిత్రాలు, ఆమె పోషించిన పాత్రలు కళ్లముందు కదలాడాయి. పలువురు ఆమె పోషించిన పాత్రలను మరోసారి గుర్తు చేసుకొన్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, ఇతర హీరోలకు తల్లిగా అద్భుతమైన పాత్రలను పోషించారు.

మైనా ప్యార్ కియాలో..

మైనా ప్యార్ కియాలో..

సల్మాన్‌ నటించిన మైనే ప్యార్ కియా సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలందుకొన్నది. ప్రేక్షకులు ఆమె ప్రతిభకు నీరాజనం పట్టారు. వెండితెర మీదే నిజజీవితంలో తల్లి అనే ఓ ఫీలింగ్‌ను కలిగించారు. కొడుకు ప్రేమ కోసం, కష్టాల్లో ఉన్న తనయుడి కోసం పరితపించే తల్లిగా నటనను అద్భుతంగా పండించారు.

కల్ హో నా హోలో..

కల్ హో నా హోలో..

కల్ హో నా హో చిత్రంలో రీమా లాగూ పోషించిన పాత్ర ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడే తన కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోయే పాత్రను మరెవరూ పోషించలేరనే విధంగా నటనతో కన్నీళ్లను పెట్టించింది. రీమా లాగూ, షారుక్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేస్తాయి.

వాస్తవ్ చిత్రంలో..

వాస్తవ్ చిత్రంలో..

మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ‘వాస్తవ్‘ చిత్రంలో రీమా లాగూ నటన ఆమె నటనకు పరాకాష్ట. చెడు మార్గాలు పట్టిన కొడుకును హతమార్చే తల్లి పాత్ర. ఈ చిత్రంలో క్లైమాక్స్‌ సందర్భంగా సంజయ్ దత్, రీమాలాగూ మధ్య నడిచే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాల్లో ఆమె నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

హమ్ ఆప్ కై హై కౌన్ చిత్రంలో

హమ్ ఆప్ కై హై కౌన్ చిత్రంలో

ఇక సూరజ్ బర్జాత్యా డైరెక్షన్‌లో వచ్చిన హమ్ ఆప్ కై హై కౌన్ చిత్రంలో రీమా లాగూ పోషించిన తల్లి పాత్ర ఆ చిత్రానికే హైలెట్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన కుటుంబ కథా చిత్రంలో ఆమె పాత్ర చిరస్మరణీయం. తల్లిగా ఆ పాత్రలో రీమాలాగూ నటించారని చెప్పడానికంటే జీవించారు అని చెప్పవచ్చు.

కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో

కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో

కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో కూడా రీమా లాగూది మరిచిపోలేనటువంటింది. కాజోల్ తల్లిగా ఆమె నటించారు. బిడ్డను కోల్పోయిన తల్లిగా.. మనువరాలిని పెంచే బాధ్యతలను భుజాన వేసుకొన్న మాతృమూర్తిగా తనదైన శైలిలో రాణించారు.

హమ్ సాత్ సాత్ హై చిత్రంలో

హమ్ సాత్ సాత్ హై చిత్రంలో

ఇక దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన హమ్ సాత్ సాత్ హై చిత్రంలో అమ్మగా రీమా లాగూ నటన మరో స్థాయికి వెళ్లింది. కుటుంబంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే తల్లిగా, జీవితంలో ఎదురైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న మాతగా అద్భుతంగా నటించారు. సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, మొహనీష్ బేహల్, నీలంకు తల్లిగా నటించారు. ఈ చిత్రం కుటుంబ కథ చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఎన్నో అవార్డులను, భారీ కలెక్షన్లన సాధించింది.

జిస్ దేశ్ మే గంగా రహ్తా హై చిత్రంలో

జిస్ దేశ్ మే గంగా రహ్తా హై చిత్రంలో

బాలీవుడ్ హీరో గోవిందా నటించిన జిస్ దేశ్ మే గంగా రహ్తా హై చిత్రంలో రీమా లాగూ పాత్ర హృదయాలను తడిమివేస్తుంది. తల్లి, కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ చిత్రంలో పోషించిన పాత్రకు గానూ రీమా లాగూ విమర్శకుల ప్రశంసలను అందుకొన్నారు.

English summary
7 most memorable movies of Reema Lagoo as a mother. Reema played the role of a mom in almost all of her movies and her sudden death is tragic and sad. She acted as Mom With Shahruh Khan, Salman Khan & Many Others!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu