For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏం కావాలో?: అల్లు అర్జున్ ని తెగ పొగడుతోంది

  By Srikanya
  |

  హైదరాబాద్ : బన్నీతో కలిసి ఓ ప్రకటనలో నటించాను. దానికి మంచి స్పందన లభించింది. ఆ సెట్‌లో బన్నీ ఇచ్చిన సలహాలు ఎప్పటికీ మరిచిపోలేను. ప్రకటనే అయినా... సినిమాలాగే భావించి తను కష్టపడిన విధానం చూసి చాలా నేర్చుకొన్నాను అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. రెజీనా కు అల్లు అర్జున్ సరసన చెయ్యాలని చాలా కాలం నుంచి ఉందిట. ఇలా అల్లు అర్జున్ ని పొగడ్తల్లో ముంచెత్తటం ద్వారా ఆఫర్ సంపాదించుకునే అవాసం ఉందని అంటున్నారు.

  'రొటీన్‌ లవ్‌స్టోరీ', 'కొత్తజంట', 'రా రా కృష్ణయ్య', 'పవర్‌' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొన్న హీరోయిన్ ఈమె. ఇటీవల 'పిల్లా నువ్వు లేని జీవితం'లో సాయి ధరమ్‌ తేజ్‌ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రెజీనా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించింది.

  తన చిత్రం గురించి మాట్లాడుతూ... ''ఇప్పటిదాకా చేసిన ప్రతీ పాత్ర నాకు ఎంతో కొంత గుర్తింపును తెచ్చిపెట్టింది. నన్ను ప్రేక్షకులకు ఇంకొంచెం చేరువ చేసింది. 'పిల్లా నువ్వు లేని జీవితం' కూడా నాకు అదే తరహా ఫలితాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నా పాత్ర పేరు శ్రీ. చూడటానికి సగటు తెలుగు సినిమా హీరోయిన్ లాగే కనిపించినా ఆ పాత్ర తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటించడం చక్కటి అనుభవం. 'రా రా కృష్ణయ్య'లో జగపతిబాబు ఉన్నప్పటికీ ఆయనతో కలిసి నటించింది లేదు. ఇందులో ఆయనతో బోలెడన్ని సన్నివేశాల్లో కనిపిస్తాను'' అన్నారు.

  Regina about Allu Arjun's Advice

  అలాగే... ''ప్రచార చిత్రాలు చూసి 'ఇందులోనూ ముద్దు సన్నివేశాలు చేసినట్టున్నారే' అని చాలామంది అడిగారు. అందరూ అనుకొంటున్నట్టుగా 'పిల్లా నువ్వు లేని జీవితం'లో ముద్దు సన్నివేశాలేమీ లేవు. కథకి ఆ అవసరం రాలేదు. అయినా ముద్దు గురించి అందరికీ అంత ఆసక్తి ఎందుకో నాకైతే అర్థం కాదు (నవ్వుతూ). తొలినాళ్లల్లో నాకు ఆ తరహా సన్నివేశాలపై అస్సలు ఆసక్తి ఉండేది కాదు. అయితే తొలి రెండు సినిమాలు విడుదలయ్యాక 'రెజీనా నటిగా ఓకే కానీ... అందంగా కనిపించడంపైనే కొంచెం దృష్టిపెట్టాలి' అన్నారు.

  'హీరోయిన్ అన్నాక తెరపై నడుము చూపించాల్సిందే' అని చెప్పారు. వాళ్లు కోరుకొన్నట్టుగానే ఆ తర్వాత సినిమాల్లో నేను అందంగానే కనిపించాల్సిన అవసరం వచ్చింది. కథ, దర్శకుడు కోరుకొన్నప్పుడు... 'నాకు అది రాదు, ఇది చేతకాదు' అనకూడదు కదా? అందుకే ట్రెండ్‌ను సెట్‌ చేస్తూ ముద్దు సన్నివేశాల్లోనూ నటించేశా. అయితే కథ కోరుకొన్నప్పుడే ఆ తరహా సన్నివేశాల్లో నటించాలన్న నియమాన్ని విధించుకొన్నా'' అని చెప్పుకొచ్చారామె.

  ఇక ''ప్రేమకథా చిత్రాల్లోనే నటిస్తున్నా... ప్రేమలో మాత్రం ఇంకా పడలేదు. నాకు నచ్చిన కుర్రాడు ఇంకా తారసపడలేదు. నటిగా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది. మంచి అవకాశాలు లభిస్తున్నాయి. మధ్యలో కొన్ని పెద్ద చిత్రాల్లోనూ నటించే అవకాశం వచ్చింది. కానీ సమయాభావం వల్ల చేయలేకపోయాను. సాయి ధరమ్‌ తేజ్‌తో మరో చిత్రం 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'లో నటిస్తున్నా.మరిన్ని మంచి పాత్రల్లో నన్ను చూసుకోవాలన్నదే నేను కనే అందమైన కల'' చెప్పుకొచ్చిందామె.

  ''రెండు పడవలపై ప్రయాణం చేయడం నాకు అస్సలు ఇష్టముండదు. తొలి అడుగుల్లోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఇక్కడ నాకంటూ ఓ గుర్తింపు లభించింది. అలాంటప్పుడు అటు ఇటు చూడాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే నా దృష్టంతా కేవలం తెలుగు సినిమాలపైనే'' అని చెప్పింది రెజీనా.

  English summary
  Actress Regina Cassandra had praised Allu Arjun and has said that she might work with her in the future.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X