»   » చిరు 150లో స్పెషల్ సాంగు చేయబోయేదెవరో తెలుసా?

చిరు 150లో స్పెషల్ సాంగు చేయబోయేదెవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సినిమా అలా ప్రారంభం అయిందో లేదో...ఇలా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ చిత్రానికి ఇంకా అఫీషియల్ గా హీరోయిన్ ఖరారు కాక పోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నారు.

తాజాగా హీరోయిన్ రెజీనా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ ఇందులో హీరోయిన్ కాదని....ఓ స్పెషల్ సాంగు కోసం ఆమెను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం నయనతార, అనుష్కలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Regina Cassandra In Chiranjeevi 150?

150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుందని....చిరంజీవికి సూటయ్యే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఏ హీరోయిన్ డేట్స్ అడ్జెస్ట్ అయితే వారినే తీసుకోవాలని అనుకుంటున్నారట.

తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు. చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు.

ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
Going by the grapevine, Regina Cassandra has grabbed the golden offer of working with Megastar Chiranjeevi, in his comeback film. Before your thoughts go haywire, let us put it clear. She is said to be roped in to shake a leg with Chiru in a special song and the female lead of the film is yet to be finalized. It is also learnt that Nayantara and Anushka are being considered to pair with the actor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu