»   » పోలీస్ గెటప్ లో రెజీనా, సందీప్ కిషన్ ఓ డౌట్ అడిగాడు

పోలీస్ గెటప్ లో రెజీనా, సందీప్ కిషన్ ఓ డౌట్ అడిగాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కృష్ణ వంశీ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'నక్షత్రం'. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ చిత్రంలో రెజీనా, నందితా హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో తీసిన రెజీనా ఫొటోను సందీప్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

గుడ్‌ కాప్‌? బ్యాడ్‌ కాప్‌? అని క్యాప్షన్‌ పెట్టి పోలీస్‌ గెటప్‌లో ఉన్న రెజీనా ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ ఏడాది సందీప్‌ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో పలకరించిన సందీప్ కిషన్ ..ఆ సినిమా డిజాస్టర్ కావటంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. సందీప్‌ కిషన్‌ తొలిసారి కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తన అభిమాన దర్శకుడు కృష్ణ వంశీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఇటీవల సందీప్‌ తెలిపారు.

ఇక రెజీనా విషయానికి వస్తే.... పద్ధతిగా కనిపిస్తూనే సెగలు రేపగల సామర్థ్యం ఉన్న హీరోయిన్ ఈమె. అయితే ఈమధ్య ఆమెకు కాస్త అవకాశాలు తగ్గినట్టే అనిపిస్తోంది. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' తరవాత మరో సినిమా చేయలేదు. అందుకే ఫామ్‌లోకి రావాలని పరితపిస్తోంది.

'మీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇవ్వండి' అంటూ కృష్ణవంశీకి అప్లికేషన్‌ పెట్టుకొందట రెజీనా. కృష్ణవంశీ.. తన హీరోయిన్స్ ని పరవ్ ఫుల్ గా , అందంగా చూపిస్తారు. అందుకే రెజీనా ఆశపడిందేమో? అంటున్నారు. ఆయన వెంటనే ఓకే చేసి, ఇదిగో ఇలా షూటింగ్ మొదలెట్టారట.

అయితే 'నా సినిమాలో బికినీ సీన్‌ ఒకటుంది. అందులో నటిస్తానంటేనే.. నిన్ను తీసుకొంటా' అని కృష్ణవంశీ మెలిక పెట్టారని చెప్పుకుంటున్నారు. దానికి రెజీనా కూడా రెడీ అయిపోయిందని టాక్‌. అంటే రెజీనాని త్వరలో బికినీలో చూడబోతున్నామన్నమాట. కానీ రెజీనా...బికినీలో చూడగలమా అనేది ఫ్యాన్స్ డౌట్.

English summary
Sundeep Kishan,Krishna Vamsi Movie is titled as ‘Nakshatra’ and it will be made in tight budget. Regina Cassendra was playing a cop in this film. Sundeep Kishan and Regina are working together for the third time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu