»   » మెగా హీరోతో ఎఫైర్ రూమర్స్... .రెజీనా స్ట్రాంగ్ రిప్లై (వీడియో)

మెగా హీరోతో ఎఫైర్ రూమర్స్... .రెజీనా స్ట్రాంగ్ రిప్లై (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్స్ పై రూమర్స్ రావటం అత్యంత సహజం. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న హీరో, హీరోయిన్స్ కు లింక్ పెడుతూనో లేక హీరోయిన్స్ బోయ్ ప్రెండ్ మెయింటైన్ చేస్తున్నారనో , ఫలానా అమ్మాయిని ఓ స్టార్ చేసుకుంటున్నాడనో రూమర్స్ వస్తూంటాయి.

రెజినా ఫోటో గ్యాలరి

అఫ్ కోర్స్ కొందరు హీరోయిన్స్ వాటిని ఖండిస్తే మరి కొందరు స్పోర్టివ్ గా తమ వృత్తిలో భాగంగా లైట్ అంటారు. అయితే రెజీనా ఈ విషయమై ఓ వీడియోలో మాట్లాడింది. ఆమె ఏమందో క్రింద చూడండి.

ఇంతకీ ఆమెపై వచ్చిన రూమర్ ఏమిటీ అంటే

రెజీనా ఈ మద్యన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ తో డేటింగ్ చేస్తోందని, వీళ్లిద్దరూ కలిసి రెస్టారెంట్స్ కు, పార్టీలకు కలిసి తిరిగుతున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె ఖండన కూడా చేసింది.

రెజీనా మాట్లాడుతూ...సాయిధరమ్‌తేజ్‌తో నాకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. మూడేళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. 'నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి' అని అడిగేవాళ్లు. ఎట్టకేలకు ఈ విధంగానైనా ఒక్క రూమర్ వచ్చింది. నేనేంటో నా ఫ్రెండ్స్‌కీ, ఫ్యామిలీ మెంబర్స్‌కీ తెలుసు. తెలుగులో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Regina's video reply On Affair rumors

అందుకే నా మాతృభాష తమిళం అయినా అక్కడ చేయడం లేదు. అక్కడికి ఓ ఏడాది తర్వాత వెళ్లినా యాక్సెప్ట్ చేస్తారు. అయినా హడావిడిగా రెండు భాషల్లోనూ ఒకేసారి చేయలేను. నాకు సమయం దొరికితే సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటా. ప్రస్తుతం 'టీచ్ ఫర్ ఛేంజ్', 'లైఫ్ ఈజ్ బాల్', 'ఆదిత్య మెహతా ఫౌండేషన్' స్వచ్ఛంద సంస్థలకి వర్క్ చేస్తున్నా అని తేల్చి చెప్పింది.

English summary
This video seems to be more like a counter response to the affair rumors on the actress Regina.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu