»   » నిర్మాతపై పెట్టింది 'నిర్భయ' కేసు...అసలు వివాదం ఇదీ

నిర్మాతపై పెట్టింది 'నిర్భయ' కేసు...అసలు వివాదం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీనిర్మాత సి.కళ్యాణ్‌ మరో వివాదంలో చిక్కుకుని మరోసారి వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో ఆయన చిత్రం ఉత్తమవిలన్ రిలీజ్ కు రెడీ అవుతున్న సమయంలో ఇలా జరగటంతో సినిమాకు సంభందించిన చాలా మందిని ఆందోళనలో పడేసింది. అయితే ఇప్పుడు అది మామూలు కేసు కాదని నిర్భయ కేసు అని తెలియటంతో సినీ వర్గాలు ఉలిక్కిపడింది. తన అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది...నిర్భయ కేసు వరకూ ఎందుకు వెళ్లిందీ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జూబ్లీహిల్స్‌ ఇన్స్‌పెక్టర్‌ సామల వెంకటరెడ్డి, బాధితురాలు డాక్టర్‌ కవిత కథనం మేరకు..

జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.5.. 31-బిలో ఉన్న స్థలంలో డా.కవిత తండ్రి దాదాపు 11 ప్లాట్లతో విమల్‌ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఇందులో జీ-1 ప్లాట్‌ను కళ్యాణ్‌ కొనుగోలు చేశారు. మరో మూడు ప్లాట్లు డాక్టర్‌ కవిత కుటుంబ సభ్యుల పేరు మీద ఉండగా మిగిలిన ప్లాట్లను ఇతరులకు విక్రయించారు. ఇటీవల మెట్రో పనుల కారణంగా అపార్ట్‌మెంట్‌కు సంబంధించి దాదాపు 200ల గజాల స్థలం విస్తరణలో కోల్పోనుండటంతో పరిహారంగా ప్రభుత్వం దాదాపు రూ.1.5కోట్లను ఇవ్వనుంది.

Registered a Nirbhaya case producer C. Kalyan

ఈ నేపథ్యంలో సి.కళ్యాణ్‌ అసోసియేషన్‌ పేరుతో శ్రీనగర్‌కాలనీలోని ఆంధ్రాబ్య్రాంకులో ప్రత్యేక ఖాతా తెరిచి అందులో ప్రభుత్వం నుంచే వచ్చే పూర్తి నగదు వేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ ఇచ్చారు. ఇది తెలుసుకున్న డాక్టర్‌ కవితతోపాటు మరికొందరు.. 'భూసేకరణకు సంబంధించి వచ్చే డబ్బులను 11ప్లాట్లలో ఉన్నవారికి వ్యక్తిగతంగా అందించాలని' కోరుతూ మరో లేఖను జీహెచ్‌ఎంసీకి అందించారు.

ఇది తెలుసుకున్న కళ్యాణ్‌ సోమవారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌లో సమావేశం జరుగుతుండగా వచ్చి కవితతో గొడవపడి ఆమెపై చేయి చేసుకున్నారు. 'అసభ్యకర పదజాలంతో దూషించి, కొట్టాడని' బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కళ్యాణ్‌పై సెక్షన్‌ 354(సి), 506, 509ల కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్‌ వెంకటరెడ్డి వివరించారు.

మరో రెండు రోజుల్లో ‘ఉత్తమ విలన్' రిలీజ్ ఉన్న నేపథ్యంలో సి. కళ్యాణ్ మీద కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది. కమల్‌ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్‌' వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతీ మేనన్‌ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు.

కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న తమిళ సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌, కమల్‌హాసన్‌ కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
A doctor has filed a case against producer C. Kalyan over a financial settlement. Kalyan and the lady doctor have flats at Road No. 5, Jubilee Hills along with other people. The Hyderabad Metro Rail will be compensating the owners for these flats and according to the doctor, Kalyan is trying to create a separate account for his apartment to get the entire compensation amount of Rs 1.04 crore
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu