»   » స్పైడర్ వాయిదా పడింది : మహేష్ అభిమానుల్లో ఆనందం.... ఎందుకంటే?

స్పైడర్ వాయిదా పడింది : మహేష్ అభిమానుల్లో ఆనందం.... ఎందుకంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' రంజాన్ కానుకగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే, సడెన్ గా 'స్పైడర్' రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీని వెనక బలమైన కారణాలు ఏమైనా ఉండి వుంటాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడా ఆలస్యానికి కారణం క్లైమాక్స్ ఏపీసోడ్ అని చెబుతున్నారు.

క్లైమాక్స్ పై కొత్త ఆలోచన

క్లైమాక్స్ పై కొత్త ఆలోచన

దర్శకుడు మురగదాస్ కి సడెన్ గా క్లైమాక్స్ పై కొత్త ఆలోచన వచ్చిందట. అది మహేష్ కి వినిపిస్తే.. కొత్త క్లైమాక్స్ ని తెరకెక్కిద్దామని పట్టుబట్టాడట. అందుకే జూన్ 23 కి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'స్పైడర్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌.ఎల్‌.పి, రిలియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.


ఫస్ట్‌లుక్‌ టైటిల్‌

ఫస్ట్‌లుక్‌ టైటిల్‌

ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విషయంలో చిత్ర యూనిట్‌ చాలా సార్లు అభిమానులను నిరాశ పర్చింది. ఎప్పుడో విడుదలవాల్సిన ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ కారణంగా చాలా ఆలస్యంగా విడుదల అయ్యింది. ఆ విషయంలో అభిమానులు చాలా నిరాశ పడ్డారు. తాజాగా ముందుగా అనుకున్న రిలీజ్‌ డేట్‌ కూడా వాయిదా పడిరది.


 జూన్‌ 23న విడుదల

జూన్‌ 23న విడుదల

ఈ చిత్రం జూన్‌ 23న విడుదల కావడం వాయిదా పడినట్టు నిర్మాతలు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన చేయకున్నా కూడా వేరే నిర్మాతలకు ‘స్పైడర్‌' వాయిదా పడినట్టు సందేశాలను పంపుతున్నారు. దాంతో ఇతర చిత్రాలు అదే రోజున విడుదలకు ముస్తాబవుతున్నాయి.
రెండు నెలలు వెనక్కి

రెండు నెలలు వెనక్కి

అయితే క్లైమాక్స్‌లో మార్పు వల్ల ఈ సినిమా విడుదల రెండు నెలలు వెనక్కి వెళ్లింది. అన్నీ కుదిరితే ఈ సినిమాను ఆగస్ట్‌ 9వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నాడట మహేష్‌. ఆగస్ట్‌ 9వ తేదీన మహేష్‌ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మహేష్‌ సినిమాలేవీ తన పుట్టిన రోజు నాడు విడుదల కాలేదు.


ఆగస్ట్‌లోనే విడుదలైన ‘శ్రీమంతుడు’

ఆగస్ట్‌లోనే విడుదలైన ‘శ్రీమంతుడు’

పైగా సినిమా ఆగస్ట్‌ 9న విడుదల చేస్తే 11 నుంచి వరుస సెలవులు. అంతేకాదు గతంలో ఆగస్ట్‌లోనే విడుదలైన ‘శ్రీమంతుడు' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇవన్నీ కలిసొచ్చి ‘స్పైడర్‌' కూడా సూపర్‌హిట్‌ అవుతుందని మహేష్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో ఉన్నారట.

English summary
Mahesh Babu’s Spyder, has been postponed. The film, a spy thriller, with loads of action, was supposed to hit the marquee on June 23, but has reportedly been postponed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu