»   » తెరవెనక వ్యవహారం నడిపిస్తున్న రేణు దేశాయ్!

తెరవెనక వ్యవహారం నడిపిస్తున్న రేణు దేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి తెర వెనక చాలా కసరత్తే జరుగుతుంది. తెర వెనక జరిగే పనులను దర్శకుడు, నిర్మాత దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాకు సంబంధించిన తెర వెనక జరిగే పనుల్లో దర్శకుడు ఎస్.జె.సూర్యతో పాటు రేణు దేశాయ్ తలమనకలై ఉన్నారట.

ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'ఖుషి' సీక్వెల్ చేస్తున్నారని, ఈ సినిమాకు రేణు దేశాయ్ నిర్మాతగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య తరచూ దర్శకుడు ఎస్.జె.సూర్య, సంగీత దర్శకుడు అనూపర్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు.

Renu Desai behind Kushi-2 Sequel

ఈ ఇద్దరూ కలిసి ముంబై వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారని..... రేణు దేశాయ్ కూడా పూణె నుండి ముంబై వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని టాక్. ఈ సినిమా విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాకపోయినప్పటికీ తెర వెనక జరిగే పనులు చకచకా జరిగిపోతున్నాయి.

పవన్ కళ్యాణ్ మరో మూడేళ్లలో సినిమాల నుండి రిటైర్ అవుతున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఈ లోగా రేణు దేశాయ్ తో సినిమా చేయడం వల్ల ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలనేది పవన్ ఉద్దేశ్యమట. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ ఇద్దరు పిల్లలు ఆమె వద్దే పెరుగుతున్నారు.

English summary
Renu Desai to Produce Pawan Kalyan Kushi-2 Sequel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu