»   » అది పవన్ కళ్యాణ్ అలవాటు కాబట్టే హాట్ టాపిక్!

అది పవన్ కళ్యాణ్ అలవాటు కాబట్టే హాట్ టాపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ట్విట్టర్లో చేసిన ట్వీటు హాట్ టాపిక్ అయింది. నేను నా కూతురికి ఈ రోజు ఇచ్చిన బెస్ట్ అడ్వైజ్ పుస్తకాలను ప్రేమించమని, పుస్తక పఠనం అవాటు చేసుకుంటే నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఫీల్ కావు అని చెప్పాను' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు.

పవన్‌ కళ్యాణ్ కు కూడా పుస్తకాలు చదిదే అవాటు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అలవాటును తన కూతురు ఆద్యకు అవాటు చేస్తోంది రేణు దేశాయ్. రేణు దేశాయ్ ఈ ట్వీట్ చేసినప్పటి నుండి ‘తండ్రి బాటలో పవన్ కూతురు' అంటూ మీడియాలో వార్తలు హోరెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలవాటు కాబట్టి ఈ విషయం మీడియాలో చర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కారణాలు ఏవో మనకు తెలియదు కానీ... ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయారనేది మాత్రం వాస్తవం. రేణు దేశాయ్ తో కలిసి పుణెలో ఉంటున్న తన పిల్లలను తరచూ వెళ్లి కలుస్తున్నారు పవన్ కళ్యాణ్. తండ్రిగా తన పిల్లలకు మంచి బుద్దులు నేర్పుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' చేస్తున్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ మరార్ నిర్మాత. ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది.

English summary
"The best advice I gave to my little girl today is fall in love with reading, with books and you will never be lonely, ever." Renu Desai tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu