twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ కి చూపించాను..నవ్వారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గాఉంటారు. అయితే వాటిల్లో ఎక్కడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉండదు.

    ""పవన్ కు సెప్టెంబర్ 2న ప్లాంట్ ఎ ట్రీ పోగ్రాం కి సంభందించిన ఫొటోని చూపించాను..ఆయన నవ్వి...మంచి ప్రారంభం అన్నారు," అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ని మీరు చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

    'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

    పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా లవ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

    రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది.

    మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

    Renu Desai Doing It For Pawan Kalyan

    రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అందామె.

    అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.

    English summary
    "Showed him the pic of 'plant a tree on 2nd Sep' campaign, he (Pawan Kalyan) smiled and said good initiative," informed Renu Desai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X