»   » అకీరా విషయంలో రేణు దేశాయ్ భావోద్వేగం.... వరుణ్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్!

అకీరా విషయంలో రేణు దేశాయ్ భావోద్వేగం.... వరుణ్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ ఈ రోజు 14వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను కట్టిపడేశాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేక పోయినప్పటికీ అతడిని గుర్తు చేసేలా ఆమె పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

చాలా సంతోషంగా ఫీలయ్యాను

చాలా సంతోషంగా ఫీలయ్యాను

మీరంతా నా బిడ్డ మీద లవ్, ఎఫెక్షన్ చూపిస్తుండటం నన్నెంతో సంతోషానికి గురి చేసింది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి అకీరాకు పుట్టినరోజు విషెస్ వెల్లువెత్తుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తల్లిగా నాకు ఎప్పుడూ చిన్నవాడే

తల్లిగా నాకు ఎప్పుడూ చిన్నవాడే

అకీరా నేటితో 14 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. టెక్నికల్‌గా ఇపుడు అతడు చిన్నవాడు కాదు. కానీ ఒక తల్లికి తను జన్మఇచ్చిన బిడ్డ ఎప్పుడూ చిన్నగా, పాపాయిగానే కనిపిస్తాడు అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.

 స్ట్రాంగ్ పేరెంట్స్, గ్రేట్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

స్ట్రాంగ్ పేరెంట్స్, గ్రేట్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

అకీరా పేరెంట్స్ ఇద్దరూ చాలా స్ట్రాంగ్. అకీరా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఫ్యామిలీ నేపథ్యం చాలా గొప్పది. ఎన్నో గొప్ప విజయాలు సాధించిన బ్యాగ్రౌండ్. నా బిడ్డకు మనస్పూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను... అని రేణు దేశాయ్ తెలిపారు.

ఏం రంగం ఎంచుకున్నా

ఏం రంగం ఎంచుకున్నా

అకీరా భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో విజయవంతంగా రాణించాలని, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. తల్లిగా నాకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు అని రేణు దేశాయ్ అన్నారు.

వరుణ్ తేజ్ విష్

తన తమ్ముడు అకీరాను విష్ చేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్.

సాయి ధరమ్ తేజ్ కూడా

తన బ్రదర్ ఇన్ లా అకీరాను విష్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్.

English summary
"It makes me extremely happy when I witness the love and affection you all shower on my baby boy. Yes, he turns 14yrs old today so technically no longer a baby but I feel that for any mother her child will always be the tiny baby who she gave birth to. Akira is born to two extremely strong parents and into a family which has amazing great achievers, from his mothers and fathers side. I wish fervently on his birthday today, as his mother, that he achieves success in whichever field he chooses and makes his mark as awesome as his family members. You all make me extremely emotional as his mother and I can never thank you all enough for the beautiful birthday wishes that have been pouring in since last night. Thank you all on behalf of my little birthday boy." Renu Desai said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X