»   » షాకింగ్: రేణు దేశాయ్ ఒక డిస్క్రిమినేటెడ్ చైల్డ్, అందుకే చంపలేదు!

షాకింగ్: రేణు దేశాయ్ ఒక డిస్క్రిమినేటెడ్ చైల్డ్, అందుకే చంపలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆడపిల్లలను పురిట్లోనే చంపేసే విష సంస్కృతి మన దేశంలో ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఆడపిల్లలు పుట్టొద్దని కోరుకునే వారు ఇప్పటికీ భారతీయ సమాజంలో ఉన్నారు. క్రింది స్థాయి కుటుంబాల్లోనే ఆడ పిల్లల విషయంలో ఇలాంటి వివక్ష ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్, ఉన్నత కుటుంబాల్లోనూ ఇలాంటి ధోరణి ఉంది అనేది కాదనలేని వాస్తవం.

హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ కూడా.... ఒక డిస్క్రిమినేటెడ్ చైల్డ్. రేణు దేశాయ్ తల్లిదండ్రులు ఆమె పుట్టిన సమయంలో ఆడ పిల్ల పుట్టిందని చాలా బాధ పడ్డారట. ఆడ పిల్ల అని తెలియడంతో ఆమె తండ్రి మూడు రోజుల వరకు ఆసుపత్రి ముఖం కూడా చూడలేదట. ఉమెన్స్ డే సందర్భంగా డైలాగ్ విత్ ప్రేమ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.

నిజమే నేను డిస్క్రిమినేటెడ్ చైల్డ్

నిజమే నేను డిస్క్రిమినేటెడ్ చైల్డ్

ప్రేమ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.... నిజమే నేను డిస్క్రిమినేటెడ్ చైల్డ్. నేను ఆడపిల్లగా పుట్టానని మా ఇంట్లో వారు చాలా బాధ పడ్డారు. నేను పుట్టిన తర్వాత మా నాన్న నన్ను చూడటానికి మూడు రోజుల వరకు ఆసుపత్రికి రాలేదు అని రేణు దేశాయ్ తెలిపారు.

అబ్బాయి కావాలనుకున్నారు

అబ్బాయి కావాలనుకున్నారు

1975లో మా అక్క పుట్టారు. ఆమె తర్వాత మా పేరెంట్స్ అబ్బాయి కావాలనుకున్నారు. కానీ ఆడపిల్లగా నేను పుట్టడంలో అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారట. మా అమ్మ నాకు 15 ఏళ్ల వయసున్నపుడు ఈ విషయాన్ని చెప్పింది అని రేణు దేశాయ్ తెలిపారు.

అందుకే చంపలేదు

అందుకే చంపలేదు

అప్పట్లో ఆడపిల్లని తెలిస్తే పిండంగా ఉన్నపుడే చంపేసేవారు. అయితే మా ఫ్యామిలీ హైలీ ఎడ్యుకేటెడ్. అందుకే కాబోలు వారు నా విషయంలో ఆ తప్పు చేయలేదు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

చాలా వివక్ష

చాలా వివక్ష

మా ఇంట్లో నేను చాలా వివక్ష ఎదుర్కొన్నాను. నా జీవితంలో జరిగింది ఎప్పటికీ మరిచిపోలేను. నా తర్వాత తమ్ముడు పుట్టాడు. అబ్బాయి అంటే ఇంట్లో దేవుడుగా చూసే వారు. వాడు ఏదైనా తప్పు చేసినా ఏమీ అనేవారు కాదు, మేము ఏదైనా చేస్తే శిక్షించేవారు, ఇదేంటని అమ్మను అడిగితే లాగి కొట్టేది. ఈ పరిస్థితులు నాపై తీవ్రమైన ప్రభావం చూపింది. టీనేజ్ లో టామ్ బాయ్ ఉండేదాన్ని అని తెలిపారు.

ఎన్టీఓ ద్వారా ఆడ పిల్లల కోసం ఏదైనా చేస్తాను

ఎన్టీఓ ద్వారా ఆడ పిల్లల కోసం ఏదైనా చేస్తాను

త్వరలో ఎన్టీఓ మొదలు పెట్టి ఆడ పిల్లల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. వారి కోసం ఎలాంటి పనులు చేస్తాను అనే విషయాలు త్వరలోనే బయట పెడతాను అని రేణు దేశాయ్ అన్నారు.

English summary
Pawan Kalyan's former wife, tollywood actress and producer Renu desai said that ‘She is a discriminated child’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu