For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పచ్చి అబద్ధం.. దానికి కారణం డబ్బు కాదు.. పవన్ గురించి రేణుదేశాయ్

  By Rajababu
  |
  Renu Desai Reveals Interesting Things About Pawan Kalyan దానికి కారణం డబ్బు కాదు

  పవన్ కల్యాణ్ తీసుకొన్న డబ్బులో నుంచి సినిమాలు తీశానని వచ్చిన వార్తలను సినీ నటీ రేణుదేశాయ్ ఖండించారు. అలాంటి వార్తలో నిజం లేదని ఆమె అన్నారు. తాను సంపాదించిన సొమ్ముపై వచ్చిన ఆదాయంతోనే సినిమా తీశానని ఆమె అన్నారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఓ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్.. దసరా పండుగను పురస్కరించుకొని టెలివిజన్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రేణు దేశాయ్ ఏమన్నారో ఆమె మాటల్లోనే..

   పిల్లల గురించి డిసిషన్

  పిల్లల గురించి డిసిషన్

  పిల్లల పెంపకం, వారి చదువు, ఇతర విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక సందేహాలు వస్తుంటాయి. ఆ సమయంలో పవన్ తోడుంటే బాగుండు. ఆయనతో మాట్లాడితే బాగుంటుంది అని అనుకొంటాను. సింగిల్ ఉమెన్‌కు చాలా కష్టాలు ఉంటాయి అని రేణుదేశాయ్ చెప్పారు.

   నా విషయంలో అది జరుగదు

  నా విషయంలో అది జరుగదు

  చాలా నా స్నేహితుల భర్తలు నేవీలో, ఆర్మీలో పనిచేస్తుంటారు. వారి భర్తలు ఆరు నెలలపాటు ఇంటి ముఖం చూడరు. ఆ సమయంలో వారు పడే బాధను నేను గుర్తు చేసుకుంటాను. అయితే వారి భర్తలు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు. నా విషయంలో అది జరుగదు అని రేణుదేశాయ్ అన్నారు.

   19 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్‌లో

  19 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్‌లో

  నా తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. దాంతో నా వయసు 19 ఏళ్లు ఉన్నప్పటి నుంచే నేను రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాభాలు వచ్చినప్పుడు వాటిని అమ్ముతాను. స్టాక్ మార్కెట్‌, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను. దాంతో డబ్బు సంపాదిస్తాను.

   అదంతా పచ్చి అబద్ధం

  అదంతా పచ్చి అబద్ధం

  పవన్‌తో విడాకులు తీసుకున్న సమయంలో ఆయన వద్ద నుంచి పరిహారంగా భారీగా డబ్బు తీసుకొన్నాను అని మీడియాలో వచ్చిన వార్తలను చూశాను. అందులో వాస్తవం లేదు. బయట చెప్పుకొనేవాటిలో నిజాలు లేవు.

   నేను సంపాదించిన మొత్తంతోనే

  నేను సంపాదించిన మొత్తంతోనే

  పవన్ నుంచి స్వీకరించిన పరిహారంలో నుంచి కొంత మొత్తాన్ని పెట్టి సినిమా తీశాను అనే వార్తలో వాస్తవం లేదు. అదంతా పచ్చి అబద్ధం. పవన్ ఇచ్చిన డబ్బుతో సినిమా తీయలేదు. నేను సంపాదించిన సొమ్ము ద్వారా వచ్చిన లాభం మొత్తం నుంచే సినిమా నిర్మాణం చేశాను.

  పవన్ సలహాలు తీసుకొంటారు

  పవన్ సలహాలు తీసుకొంటారు

  డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో నాకు మంచి పట్టు ఉంది. ఇన్వెస్ట్ మెంట్ విషయంలో పవన్ కల్యాణ్ కూడా నా నుంచి సలహాలు తీసుకునే వాడు. చిన్నతనం నుంచే ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉండటంతో ఇది సాధ్యమైంది.

   అందుకే చిన్న క్లారిఫికేషన్

  అందుకే చిన్న క్లారిఫికేషన్

  పవన్ కల్యాణ్ నుంచి పొందిన పరిహారం గురించి వచ్చే గాసిప్స్‌పై నా పిల్లలు చెడుగా అనుకోవద్దు. అందుకే వాటి గురించి మీడియాలో చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని అనుకొన్నాను. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తున్నాను అని రేణుదేశాయ్ వెల్లడించారు.

   కోరికలు అనంతం

  కోరికలు అనంతం

  డబ్బు కోసం ఎప్పుడూ కక్కుర్తి పడను. మూడు పూటల తిండి, కనీస వసతులు ఉంటే చాలు. అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చులకు సరిపడే మొత్తం. ఉండటానికి చక్కని ఇల్లు ఉంటే చాలు. కోరికలు చాలా అనంతం. వాటికి ఓ పాయింట్ వద్ద చెక్ పెడితే చాలా సంతోషంగా ఉండవచ్చు.

   పవన్ డబ్బు మనిషి కాదు

  పవన్ డబ్బు మనిషి కాదు

  నాకు మొదటి నుంచి సమాజానికి సేవ చేయాలని ఉంది. జనసేన పార్టీకి ప్రచారం చేయడమనేది నా పరిధిలో లేదు. పవన్ ఉన్నంత వరకు మరొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. పవన్ డబ్బు మనిషి కాదు. ఏది చేసినా మనసు పెట్టి చేస్తాడు. సమాజం గురించి బాగా ఆలోచిస్తాడు. పవన్‌తో 11 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయనలో ఎలాంటి స్వార్ధం కనిపించదు

   పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను

  పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను

  పవన్‌తో విడాకుల తర్వాత పెళ్లి, రిలేషన్ షిప్ గురించి ఆలోచించలేదు. కానీ అనారోగ్యం పాలై చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన తర్వాత నాకు ఒకరు తోడుంటే బాగుండు అనే కోరిక కలిగింది. నేను హాస్పిటల్ ఉంటే నా పిల్లలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే పెళ్లి గురించి ఆలోచనలో పడ్డాను. భవిష్యత్‌లో ఏమీ జరుగుతుందో వేచి చూడాలి.

  English summary
  Power star Pawan Kalyan's ex wife Renu Desai doing a Program Neetone. In this occasion, She speaks to media about her professional and personal experience. Renu Desai told that she suffering with single women status. And she reveals some interesting things about Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X