»   » పవన్‌తో అలా జరుగకుంటే బాగుండు.. ఒంటరి జీవితం చాలా కష్టం.. రేణుదేశాయ్

పవన్‌తో అలా జరుగకుంటే బాగుండు.. ఒంటరి జీవితం చాలా కష్టం.. రేణుదేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినా ముందుకు సాగాల్సిందేనని హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అభిప్రాయపడింది. తాజాగా ఆమె బుల్లితెరపై ప్రసారమయ్యే నీతోనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగాన్ని ఆమె ఓ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్చూ ఇచ్చారు.

రీ ఎంట్రీ కాదు.

రీ ఎంట్రీ కాదు.

టాలీవుడ్‌కు కమ్ బ్యాక్ అని అనకూడదు. మానసికంగా నేను ఇక్కడే ఉన్నాను. కానీ పనిచేయలేదు. కెరీర్ పరంగా బ్రేక్ తీసుకొన్నాను. అంతమాత్రాన కమ్ బ్యాక్, రీ ఎంట్రీ అనకూడదు.

నేను స్ట్రాంగ్ ఉమెన్

నేను స్ట్రాంగ్ ఉమెన్

జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పడు వైఫల్యాలు నాపై అధిపత్యం సాగించడం ఇష్టముండదు. మొదట్లో కొంత బెరుకగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు నన్ను స్ట్రాంగ్ ఉమెన్‌గా మార్చింది.

ఏది ఏమైనా ముందుకు సాగాలి

ఏది ఏమైనా ముందుకు సాగాలి

జీవితంలో సింగిల్ ఉమన్‌గా ఉండటం కష్టమే... అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయినా... జీవితంలో మనం తీసుకొన్న నిర్ణయాలను బట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

పవన్‌తో విడిపోవడం పెద్ద ప్రశ్నే

పవన్‌తో విడిపోవడం పెద్ద ప్రశ్నే

నాకు ఎదురైన సమస్య గురించి ఆలోచించుకుంటే అలా జరుగకుండా ఉంటే బాగుండేదని అనుకొంటాను. ఇప్పటికీ అది నా జీవితంలో ఓ పెద్ద ప్రశ్నే. అయితే నేను తీసుకొన్న నిర్ణయానికి ఎలాంటి బాధపడటం లేదు అని పవన్ కల్యాణ్‌తో విడిపోవడంపై పరోక్షంగా సమాధానమిచ్చారు.

 అమ్మ చెప్పిన మాటను

అమ్మ చెప్పిన మాటను

ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పవద్దనే విషయాన్ని నా తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించింది. ఇప్పటికీ తల్లి మాటలను అనుసరిస్తున్నాను. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నాను. ఏనాడూ అబద్ధం చెప్పలేదు.

నేను అకీరా మంచి ఫ్రెండ్స్

నేను అకీరా మంచి ఫ్రెండ్స్

నా కుమారుడు అకీరా, నేను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటాం. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుంది. సుఖం, దుఖాలను సమానంగా తీసుకునే స్థిత ప్రజ్ఞత ఉంది అని రేణుదేశాయ్ చెప్పింది.

English summary
Power star Pawan Kalyan's ex wife Renu Desai doing a Program Neetone. In this occasion, She speaks to media about her professional and personal experience. Renu Desai told that she suffering with single women status.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu