»   » రూమర్ కాదు... నిజమే అని ఖరారు చేసిన రేణు దేశాయ్‌

రూమర్ కాదు... నిజమే అని ఖరారు చేసిన రేణు దేశాయ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ భార్య రేణు దేశాయ్‌ చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఆమె మరాఠీ భాషలో సినిమాను నిర్మిస్తున్నారు. 'మంగళాష్టక్‌కే వన్స్‌మోర్‌' పేరుతో ఇది రూపొందుతోంది. ఇది భార్యాభర్తల అనుబంధం చుట్టూ తిరిగే కథ.

ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ... '' నేను నిర్మాతగా మారటమనేది నిజమే... పుణెలో పుట్టి పెరిగాను. మరాఠీ నాటక రంగం ఎప్పుడూ మంచి స్థితిలో ఉంటోంది. అయితే ఇక్కడి సినిమా మాత్రం కొంత వెనకబడే ఉంది. నేను నిర్మాతగా తీసే తొలి చిత్రం మరాఠీలోనే కావడం సంతోషము'' అని రేణు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్‌ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేణు తొలిసారి తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన 'బద్రి'లో నటించారు. ఆ తరవాత పవన్‌ దర్శకత్వం వహించిన 'జానీ'లోనూ ఆమే హీరోయిన్ . ఆ తరవాత పవన్‌ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.

English summary
Pawan Kalyan’s wife Renu Desai is now a producer. She will be producing a Marathi film by name Mangalashtake Once More. This film will star Swapnil Joshi and Mukta Barve in the lead and will be shot in Pune.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu