»   » పవన్ ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది: నీతోనే.... అంటూ రేణు దేశాయ్ వచ్చేసింది!

పవన్ ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది: నీతోనే.... అంటూ రేణు దేశాయ్ వచ్చేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు రాష్ట్రాల్లో రేణు దేశాయ్ గురించి ఎక్కువగా ఆలోచించేది, ఆమెను అమితంగా అభిమానించేది ఎవరు? అంటే.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్ నుండి ఆమె విడిపోయిన తర్వాత చాలా బాధ పడింది కూడా వీరే.

పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ తమకు దూరంగా ఎక్కడో పూణెలో ఉండటం అభిమానులకు ముందు నుండి ఇష్టం లేదు. ఆమె తమకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి అభిమానుల్లో ఉండేది. ఆమె తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఉంటే బావుండు అని కోరుకున్న వారు చాలా ఉంది ఉన్నారు. తాజాగా వారుకోరుకున్నది నిజం అయింది.

నీతోనే డాన్స్... అంటూ వచ్చేసింది

నీతోనే డాన్స్... అంటూ వచ్చేసింది

కొన్ని రోజులుగా రేణు దేశాయ్ బుల్లితెరపైకి వస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మాటీవీలో డాన్స్ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని స్టార్ మాటీవీ వారు అఫీషియల్ గా ప్రకటించారు. ‘నీతోనే డాన్స్' అనే షో ద్వారా ఆమె తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Bigg Boss VS NeethoneDance బిగ్ బాస్ కి రేణు దేశాయ్, ఆదా శర్మ గట్టి పోటీ
డాన్స్ అంటే రెండు హృదయాల బాష

డాన్స్ అంటే రెండు హృదయాల బాష

రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించబోతున్న ‘నీతోనే డాన్స్' షోకు సంబంధించిన అఫీషియల్ ప్రోమోను మాటీవీ వారు విడుదల చేశారు. డాన్స్ అంటే రెండు హృదయాల భాష అంటూ తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు రేణు దేశాయ్.

రేణు దేశాయ్ ఎందుకు?

రేణు దేశాయ్ ఎందుకు?

తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగానికి దూరంగా పూణెలో ఉంటున్న రేణు దేశాయ్ ని ఈ షోకు జడ్జిగా ఎంపిక చేయడానికి కారణం..... ఆమె వెనక బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే. పైగా బుల్లితెరకు ఆమె కొత్త ఫేస్. పవన్ మాజీ భార్య కూడా.... అందుకే ఈ షోకు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రోమో ఇదే..

రేణు దేశాయ్ ‘నీతోనే డాన్స్' రియాల్టీ షోకు సంబంధించిన ప్రోమో ఇదే.

రేణు దేశాయ్ ట్వీట్

నీతోనే డాన్స్ షో గురించి రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. ఇదో మంచి షో అవుతుందన్నారు.

బిగ్ బాస్ స్థానంలో

బిగ్ బాస్ స్థానంలో

బిగ్ బాస్ రియాల్టీ షో సెప్టెంబర్ 24తో ముగియనుంది. ఆ స్థానంలో ‘నీతోనే డాన్స్' రియాల్టీ షోను రీప్లేస్ చేయడం ద్వారా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. 'స్టార్ ప్లస్' లో వస్తోన్న 'నాచ్ బలియే' తరహాలో ఈ డాన్స్ షో వుంటుందట.

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే రేణు దేశాయ్ ఫైనల్ అవ్వగా తాజాగా జానీ మాస్టర్, హీరోయిన్ ఆదా శర్మను తీసుకున్నారని తెలుస్తోంది.

English summary
"We Hearty welcome Renuudesai in her new journey to be part of biggest Dance show with Romance Neethone Dance." Star Maa tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X