»   » సినిమా చూస్తున్నా, నన్ను కాపాడండీ..!: ఆ సినిమా థియేటర్ నుంచి కేంద్ర మంత్రికి ట్వీట్

సినిమా చూస్తున్నా, నన్ను కాపాడండీ..!: ఆ సినిమా థియేటర్ నుంచి కేంద్ర మంత్రికి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా నచ్చలేదంటే ప్రేక్షకుడు ఏం చేస్తాడు టికెట్ డబ్బులు వేస్టయినందుకు ఆ దర్శకున్నీ, హీరోనీ తిట్టుకుంటాడు. ఏదో ఎంటర్టైన్ మెంట్ కోసం వస్తే బుర్ర వేడెక్కించిన సినిమాని ఎండగడుతూ నాలుగు మాటలు బయటికి వచ్చాక చెప్తాడు. ఈ మధ్య అయితే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఏకంగా హీరోలనీ, దర్శకులనీ హ్యాష్ టాగ్ పెట్టి మరీ ఏకిపారేయటమూ మొదలయ్యింది... కానీ ఒక కేంద్రమంత్రికే కంప్లైంట్ చేయటం మాత్రం విచిత్రమే కదా... అదే పని చేసాడు ఒళ్ళు మండిన ప్రేక్షకుడు ఒకరు.

జబ్ హ్యారీ మెట్ సేజల్

జబ్ హ్యారీ మెట్ సేజల్

శుక్రవారం విడుదల అయిన షారూక్ ఖాన్ సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సేజల్'పూర్తిగా నెగిటివ్ టాక్ ను ఎదుర్కొంటోంది. ‘జబ్ వి మెట్' దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షారూక్, అనుష్కా శర్మలు జంటగా నటించగా వచ్చిన ఈ సినిమా పట్ల క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత చెత్త సినిమా చూడలేదు.. అని వారు ఏక వాక్యంలో చెప్పేస్తూ ఉండటం విశేషం.

Shahrukh Khan summoned by ED over foreign exchange violation | Oneindia News
నెగిటివ్ పబ్లిసిటీ ఊపందుకుంది

నెగిటివ్ పబ్లిసిటీ ఊపందుకుంది

విడుదల అయిన ఫస్ట్ షో నుంచినే షారూక్ సినిమాపై ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఊపందుకుంది. సినిమా విడుదలకు ముందు బాగానే హడావుడి చేసిన యూనిట్ తీరా విడుదల తర్వాత మొహం చాటేసింది. దర్శకుడు ఇంతియాజ్ కానీ, హీరో షారూక్, హీరోయిన్ అనుష్క కానీ మీడియా ముందుకే రాలేదు.

సినిమా చూడటం మనీ వేస్ట్, టైమ్ వేస్ట్

సినిమా చూడటం మనీ వేస్ట్, టైమ్ వేస్ట్

తమ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పుకోవడానికి రాలేదు. ఈ సినిమాతో షారూక్ పరాజయాల హ్యాట్రిక్ ను పూర్తి చేశాడని మరికొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూడటం మనీ వేస్ట్, టైమ్ వేస్ట్.. అని కొందరు రివ్యూయర్లు ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.

సాధ్యమైనంత తొందరగా నన్ను కాపాడండి

సాధ్యమైనంత తొందరగా నన్ను కాపాడండి

ఈ నేపథ్యం లోనే ‘మేడం.. జియాన్‌ థియేటర్‌లో ‘జబ్‌ హ్యారీ మెట్‌ సేజల్‌' సినిమా చూస్తున్నాను. సాధ్యమైనంత తొందరగా నన్ను కాపాడండి.. ఇక్కడి నుంచి బయటపడేయండి..' అంటూ పుణెకు చెందిన విశాల్‌ సూర్యవంశీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

1600మంది రీట్వీట్ చేశారు

1600మంది రీట్వీట్ చేశారు

నిమిషాల వ్యవధిలోనే విశాల్‌ ట్వీట్‌కు 2500 లైక్స్‌ రాగా, 1600మంది రీట్వీట్ చేశారు. అయినాసరే, కేంద్ర మంత్రి మాత్రం స్పందించలేదు. దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్లున్న సుష్మా స్వరాజ్‌కు ఇలాంటి వింత ఫిర్యాదులు కొత్తేమీకాదు. ఆ మధ్య ఓ యువకుడు.. తాను మార్స్‌పై చిక్కుకుపోయానని, సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించడం, ఇంకొకరు తన ఫ్రిడ్జ్‌ చెడిపోయిందని చెప్పుకొవడం తెలిసిందే.

English summary
A tweet currently going viral has a man, fed up while watching the Shah Rukh Khan-Anushka Sharma starrer Jab Harry Met Sejal, asking to be rescued from a movie theatre in Pune.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu