»   » ‘ఎలాంటి దుస్తులు వేసుకున్నా సరే... మహిళలను గౌరవించాలి’

‘ఎలాంటి దుస్తులు వేసుకున్నా సరే... మహిళలను గౌరవించాలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి విద్యా బాలన్. తాజాగా యూత్ ఫర్ యూనిటీ ఈవెంటులో పాల్గొన్న ఆమె మహిళలకు ఈ సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకున్నారనే విషయంతో సంబంధం లేకుండా వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని విద్యా బాలన్ అభిప్రాయ పడ్డారు. మహిళలు వారికి నచ్చినట్లుగా ఎలాంటి బట్టలైనా వేసుకునే స్వేచ్ఛ ఉండాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందని అన్నారు.

Respect for girls shouldn't depend on their clothes: Vidya Balan

మహిళలు వేసుకునే దుస్తువులకు, వారికి ఇచ్చే రెస్పెక్టుకు లింకు పెట్టి మాట్లాడొద్దని విద్యా బాలన్ అన్నారు. అమ్మాయిలు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా....వారు వేసుకునే దుస్తులతో సంబంధం లేకుండా గౌరవం ఇవ్వాలని. కానీ లాంటి పరిస్థితులు మన దేశంలో లేవనే అభిప్రాయం వ్యక్తం చేసారు విద్యా బాలన్.

అక్కడ ఇక్కడ అని కాకుండా మన సమాజంలో చాలా చోట్ల ఈవ్ టీజింగ్ ఉంది. అమ్మాయిలు ఇలాంటి విషయాల పట్ల భయం లేకుండా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా తమ మాటలతో, చేష్టలతో వేధింపులకు గురి చేస్తే వెంటనే తిరగబడి చెంపదెబ్బ కొట్టండి. అపుడు అలాంటి వారు మళ్లీ మీజోలికి రాకుండా పారిపోతారు అని విద్యా బాలన్ తెలిపారు.

English summary
Vidya Balan feels it's important that respect for a woman should be independent of the clothes that she wears.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu