»   » 'పటాస్' కన్నడ రీమేక్ ఫస్ట్ లుక్ (ఫొటోలు)

'పటాస్' కన్నడ రీమేక్ ఫస్ట్ లుక్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన చిత్రం 'పటాస్'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'పటాస్' ఇప్పుడు కన్నడంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. గోల్డెన్ స్టార్ గణేష్ ఈ చిత్రం రీమేక్ చేస్తున్నారు. పటాకి టైటిల్ తో రీమేక్ అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసారు. ఆయన షేర్ చేసిన ఫొటోలు చూడండి.

Good Luck to Ganesh for the official Kannada remake of Patas.


Posted by Nandamuri Kalyanram on 29 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


గతంలో గణేశ్ తో 'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం' రీమేక్ చేసి విజయం సాధించిన మంజు స్వరాజ్ 'పటాస్' రీమేక్ కూ దర్శకత్వం వహించనున్నాడ... కన్నడ 'పటాస్'లో కీలక పాత్రకు మనోజ్ బాజ్ పేయిని ఎంచుకున్నట్టు సమాచారం.


మరో ప్రక్క


చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న నటదర్శకుడు లారెన్స్ కు ఇటీవల వచ్చిన 'గంగ' కాసింత ఊరట నిచ్చింది... ఆ ఊపుతోనే లారెన్స్ కూడా 'పటాస్'ను తమిళంలో రీమేక్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు... 'పటాస్' సాధించిన విజయం అటు తమిళులను, ఇటు కన్నడిగులను ఎంతగానో ఆకర్షించింది.


REVEALED: First Look Of Ganesh From Upcoming Movie 'Pataki'

ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకోవాలని ఉత్తరాది నిర్మాతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం...ఏది ఏమైనా 'పటాస్' సాధించిన విజయమే కాకుండా, ఈ చిత్రం రీమేక్స్ వల్ల కూడా నటనిర్మాత కళ్యాణ్ రామ్ కు ఆదాయం వస్తూ ఉండడం విశేషం... మరి కన్నడ, తమిళ భాషల్లో 'పటాస్' ఏ రీతిన అలరిస్తుందో చూడాలి...


చిత్రం కథేమిటంటే...


కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


తెలుగు దర్శకుడు అనీల్ రావి పూడి మాట్లాడుతూ... ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు


అనిల్‌ రావిపూడి. కథ గురించి చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

English summary
Golden Star Ganesh is making huge news in social media about his upcoming movie Pataki. The Gaalipata actor looks impress in the first look poster of Pataki.
Please Wait while comments are loading...