»   » ‘రేయ్’ సినిమాకు 41 సెనార్స్ కట్స్, అన్ని బూతులా?

‘రేయ్’ సినిమాకు 41 సెనార్స్ కట్స్, అన్ని బూతులా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్' చిత్రం ఈ నెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ చేసింది. అంతే కాకుండా సినిమాలో 41 చోట్ల సెన్సార్ కట్స్ విధించింది.

దీన్ని బట్టి సినిమాలో అసభ్య పదజాలం, బూతులు, హాట్ సీన్లు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని సినీ జనాలు ఆశ్చర్య పోతున్నారు. మరో వైపు సినిమా రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఏకంగా 168 నిమిషాల నిడివి ఉంది. అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలు. ఈచిత్రం కోసం వైవిఎస్ చౌదరి దాదాపు 20 కోట్లు ఖర్చు చేసారట. పైగా సోలో రిలీజ్ కాకుండా ఇతర సినిమాలతో కలిసి రిలీజ్ చేస్తున్నారు.


Rey Movie Censor Cuts List

ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన వైవిఎస్ చౌదరి సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘రేయ్' మూవీపై స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘రేయ్ విత్ పవనిజం' పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు.


మరో విశేషం ఏమిటంటే.... ‘రేయ్' మూవీ విడుదల తేదీ అయిన మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సినిమా వైపు ప్రేక్షకులను లాగడానికి చౌదరి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయాలు గమనిస్తే ఇట్టే తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్స్ వరకే.... సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుంది అనే దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయనేది వాస్తవం.

English summary
Sai Dharam Tej's 'Rey' obtained an 'A' Certificate from the Censor Board. Members have suggested several Cuts (41) and the final run time of the movie is 168 minutes.
Please Wait while comments are loading...