»   » మాటమారింది: పవన్ కళ్యాణ్‌కి సంబంధం లేదన్న వైవిఎస్

మాటమారింది: పవన్ కళ్యాణ్‌కి సంబంధం లేదన్న వైవిఎస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి.....ఇంతకాలం మెగా ఫ్యామిలీ వాడంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆడియో వేడుకకు ముఖ్య అతిథి హాజరైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వైవిఎస్ చౌదరి నోట్లో పచ్చి వెలక్కాయ్ పడ్డట్లయింది.

ఫ్యామిలీ పేరు వాడటం నాకు ఇష్టం ఉండదు, ఈ పరిశ్రమ ఏ ఎక్కరి సొంతం కాదు, మా ఫ్యామిలీది కూడా కాదు, కష్టపడే ప్రతి ఒక్కరిది అని వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఫ్యామిలీ డబ్బా కొట్టుకోవద్దు అంటూ పరోక్షంగా చురకలంటించాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఆలోచనలో పడ్డ వైవిఎస్ ఇపుడు మాట మార్చాడు.

ఇన్నాళ్లు వైవిఎస్ చౌదరి......పవన్ కళ్యాణ్‌ వల్లనే ఈ సినిమా తీస్తున్నాం, ఆయన నాపై నమ్మకంతో అల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను నా చేతిలో పెట్టారు, కథ కూడా ఆయనే ఒకే సారనే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇపుడు వైవిఎస్ వాయిస్ మారింది. 'రేయ్' సినిమాకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం లేదని అంటూ మాట మార్చాడు ఈ దర్శకుడు.

నేను పవన్ కళ్యాన్‌ను సంప్రదించిన మాట వాస్తవమే...కానీ ఆయన తేజ్‌తో సినిమా తీయడానికి నా పర్మిషన్ అవసరం లేదు, డైరెక్టుగా వెళ్లి అతన్నే కలవని చెప్పారు. రేయ్ కథ ఎంపికలో కూడా పవన్ కళ్యాణ్‌ ప్రమేయం లేదు అని వైవిఎస్ ప్రచారం చేస్తున్నారు.

వైవిఎస్ చౌదరి ఇలా మాట మార్చి ప్రచారం చేయడం వెనక మరో కారణం కూడా ఉంది. రేపు 'రేయ్' సినిమా అనుకున్న ఫలితాలు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్‌కు బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే ఇప్పటి నుండే ఆయనకు, రేయ్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రచారం చేస్తున్నారు వైవిఎస్. గతంలో 'ఆరెంజ్' సినిమా కథ కూడా పవన్ ఓకే చేయడం, అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం తెలిసిందే.

English summary

 "Pawan Kalyan has no role in choosing Sai as the main lead for Rey" director YVS Chowdary told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu