»   » 'శ్రీమంతుడు' చిత్రాన్ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

'శ్రీమంతుడు' చిత్రాన్ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి చిత్రం విజయాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వరస ట్వీట్స్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా శ్రీమంతుడు చిత్రాన్ని టార్గెట్ చేసారు. ఆయన శ్రీమంతుడు చిత్రానికి బాహుబలి షాక్ తగులుతుందనే అర్దం వచ్చేలా ట్వీట్ చేసారు. ఆయనేం ట్వీట్ చేసారో మీరే ఈ క్రింద చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాహుబలి గురించి కూడా... "ప్రతీ డంబ్ అభిమానికి తెలియాల్సిన విషయం ఏంటంటే.. పవర్ స్టార్, రెబెల్ స్టార్, సూపర్ స్టార్ కన్నా సినిమా అనేది చాలా పెద్దది. అసలు పాయింట్ ఏంటంటే, బాహుబలి అనే పాయింట్ పవన్, మహేష్, తారక్ తెలుస్కోకపోతే ఇక వారికిక పాయింట్ ఏమి వుండదు" అంటూ కామెంట్ చేసాడు వర్మ. అంతేకాక బడా స్టార్ లకి ఈ సినిమా అంటే కుళ్ళు అని, అందుకనే ప్రచారం చెయ్యలేదని అన్నారు.


Rgv about Baahubali and Srimanthudu


అలాగే....రాజమౌళి ఇక్కడ పుట్టినందుకు తెలుగువారు గర్వించాల్సిన అవసరం లేదని, ఏ బాంబేలోనో లేక లాస్ ఏంజెలెస్‌లోనో పుట్టనందుకు రాజమౌళి ఎంతో దురదృష్టవంతుడని తెలిపాడు. హీరో కంటే కూడా కథే గొప్పదని బాహుబలి నిరూపించిందని, ఈ విషయాన్ని దశాబ్దాల క్రితమే హాలీవుడ్ గుర్తించిందని తెలిపాడు.సినిమాను రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చాడు. బాహుబలిలో ప్రభాస్ టెర్రిఫిక్ గా ఉన్నాడని... రానా అయితే పర్మామెన్స్ పరంగా ఒక పర్వతంలా కనిపించాడని చెప్పాడు. బాహుబలి తర్వాత వచ్చే పెద్ద హీరోల సినిమాలు 5డీలో చూడాల్సి ఉంటుందని అన్నాడు. తమకంటే గొప్పవాళ్లు లేరని విర్రవీగుతున్న హీరోలకు ఈ సినిమా కనువిప్పు కలిగించిందన్నాడు.సింహాలు, పులులు, కొండచిలువలు, ఏనుగులతో నిండిన పరిశ్రమలోకి బాహుబలి అనే డైనోసార్ వచ్చిందని ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమాతో సినీ పరిశ్రమలోని వ్యక్తులను రాజమౌళి అభద్రతా భావంలోకి నెట్టేశారని... దాన్నుంచి వారు బయటపడాలంటే, రాజమౌళి వేసిన బాటలో ప్రయాణించటం ఒక్కటే దారని చెప్పాడు.రానున్న రోజుల్లో స్టార్ హీరోల పెద్ద సినిమాలన్నీ కూడా బాహుబలి ముందు 'లో బడ్జెట్' సినిమాలుగా మారనున్నాయని, ఇతర దర్శకులంతా రాజమౌళిని చూసి ఇప్పటికే అసూయపడుతన్నారని చెప్పారు. ఒకవేళ తన తదుపరి చిత్రం కోసం రాజమౌళి నాలుగేళ్ల సమయం తీసుకుంటే, సినిమా పరిశ్రమ బతికి బట్టకట్టలేదని ఇన్ డైరెక్టుగా ఇతర దర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
English summary
Ram Gopal Varma tweeted: "The Real After Shock of the Bahubali Quake will be on Srimanthudu"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu