»   »  అలా జరిగితే పవన్ కళ్యాణ్‍‌కి చాలా బ్యాడ్..?

అలా జరిగితే పవన్ కళ్యాణ్‍‌కి చాలా బ్యాడ్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే హిందీ రిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ బాక్సాఫీసు వసూళ్లు..... పవన్ కళ్యాణ్ కంటే ప్రభాసే పెద్ద స్టార్ అని నేషనల్ లెవల్లో నిరూపిస్తుందంటూ వర్మ అభిప్రాయ పడ్డారు. బాహుబలి లాంటి విజువల్ వండర్స్ లేకుండా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడం పెద్ద బ్లండర్ అంటున్నారు వర్మ.

పవన్ కళ్యాణ్ కొట్టాడంటూ ఇష్యూ.... షకలక శంకర్ స్పందన!
ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు బ్యాడ్ చేస్తుందని....నేషనల్ ప్రేక్షకుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ కంటే చిన్నా హీరోగా కనిపిస్తాడని వర్మ ఆందోళన వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి హిమాలయన్ మిస్టేక్ చేయవద్దని నా అడ్వైజ్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.

బాహుబలి లాంటి పెద్ద సినిమా చేసినపుడే పవన్ కళ్యాణ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే బావుంటుంది. అలాంటిదేమీ లేకుండా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం పవన్ కళ్యాన్ కు మైనస్సే.....బాహుబలి ముందు సర్దార్ గబ్బర్ సింగ్ చాలా చిన్నగా కనిపిస్తుంది అంటూ వర్మ ట్వీట్ చేసారు.

పవన్ గురించి వర్మ చేసిన ట్వీట్స్ స్లైడ్ షోలో...

వర్మ ట్వీట్


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాలీవుడ్లో రిలీజ్ చేయడం పెద్ద బ్లండర్ అంటూ వర్మ ట్వీట్

బ్యాడే..


సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ రిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు బ్యాడే... పవన్ కంటే ప్రభాసే పెద్ద స్టార్ అని అంతా అనుకుంటారు అంటూ ట్వీట్

పవన్ మిస్టేక్ చేయొద్దు


పవన్ కళ్యాణ్ ఇలాంటి మిస్టేక్ చేయవద్దంటూ వర్మ ట్వీట్...

చిన్నగా..


బాహుబలి లాంటి సినిమా ముందు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చాలా చిన్నగా కనిపిస్తుందని వర్మ ట్వీట్

English summary
"It will be bad for Pawan Kalyan if "Sardar Gabbar Singh" box office in Hindi will prove that Prabhas is bigger than P k on a National Level" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu