»   » పవన్ కళ్యాణ్ కొట్టాడంటూ ఇష్యూ.... షకలక శంకర్ స్పందన!

పవన్ కళ్యాణ్ కొట్టాడంటూ ఇష్యూ.... షకలక శంకర్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని రోజులుగా ఇంసడ్ట్రీ సర్కిల్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ను కొట్టాడని, అతను మరెవరో కాదు జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకెలుతున్న షకలక శంకర్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

పవన్ కొట్టింది ఈ కమిడియన్ నే? కుళ్లు జోక్స్, కామెంట్స్ కారణం
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ఇలా ప్రవర్తించడంపై భిన్నవాదనలు వినిపించాయి. షకలక శంకర్ సెట్స్ లో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించాడని, దర్శకుడిపై ప్రాక్టికల్ జోక్స్ వేసాడని, అతని మూలంగా సెట్స్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని, అందు వల్లే పవన్ కళ్యాణ్ సహనం కోల్పోయి అతన్ని లాగి చెంపదెబ్బ కొట్టానే ప్రచారం జరిగింది.

Pawan Kalyan is God for me: Shakalaka Shankar

పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... 'సర్దార్'చూడను!
ఈ పరిణామాల నేపథ్యంలో షకలక శంకర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తనను పవన్ కళ్యాణ్ కొట్టాడనే వార్తలో నిజం లేదని స్పష్టం చేసారు. ఒక వేళ నేను సీన్ సరిగా చేయక పోతే పవన్ కళ్యాణ్ కాస్త వార్మ్ అవుతారు. అంతే తప్ప ఆయన నన్ను కొట్టాడనే విషయంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు శంకర్.

ఈసారి పవన్ 'పోతురాజు ' అంటూ చెలరేగిపోతాడు!
పవన్ కళ్యాణ్ నాకు దేవుడు లాంటి వాడని షకలక శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణే స్వయంగా పిలిచి తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని శంకర్ స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో అందరితో చాలా సరదాగా ఉంటారని, ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు అని శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కోసం తాను చేపల పులుసు కూడా ప్రిపేర్ చేసాను, ఆయనకు నేను చేసిన చేపల పులుసు చాలా బాగా నచ్చింది అని శంకర్ చెప్పుకొచ్చారు.

English summary
"Pawan Kalyan is God for me and everyone knows how much I admire him. He personally called me and gave me this role," said Shankar. When asked about the slapping incident, Shankar said, "If I would not do a scene properly, Pawan would warn me, and that's it. It is not true that he slapped me".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu