»   » ఇటు బన్ని , అటు వర్మ ఇధ్దరూ పవన్ ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ..

ఇటు బన్ని , అటు వర్మ ఇధ్దరూ పవన్ ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అటు రామ్ గోపాల్ వర్మ, ఇటు అల్లు అర్జున్ ...ఇద్దరూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యిన వాళ్ళే. అయితే ఇధ్దరూ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఫ్యాన్స్ ని కూల్ చేసే పనిలో పడ్డారు...ఇలా..

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా ట్వీట్స్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ, పవన్ అభిమానుల ఆగ్రహానికి సైతం గురి అయ్యారు. అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అదృష్టవంతులని, వారికి పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. పవన్‌ తిరుపతి బహిరంగ సభ ప్రసంగాన్ని పూర్తిగా విన్న వర్మ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

'పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరు. ఇప్పుడే మొత్తం పీకే స్పీచ్‌ చూశాను. తాను మాట్లాడుతున్న విషయంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. మూడు దశల్లో పోరాటం చేయాలన్న నిర్ణయం సరైనది.

పవన్‌కల్యాణ్‌ తెలివైన ఆలోచనలను, ఉద్యమ ప్రణాళికలను తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. పీకేని కలిగి ఉండటం ఏపీ ప్రజల అదృష్టం' అని ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా గురించి ఇటీవల తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ ప్రసంగించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మోరో ప్రక్క పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు బన్నీ. 'మెనీ మెనీ హ్యీపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే టు అవర్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌' అంటూ ట్వీట్‌ చేశాడు.

బర్త్‌డే విషెస్‌ చెప్పి పవన్‌ ఫ్యాన్స్‌ను కూల్‌ చేయాలని ప్లాన్‌ వేశాడన్న మాట బన్నీ అనే మాటలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే 'సరైనోడు' ఫంక్షన్లో పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడడానికి నిరాకరిస్తూ 'చెప్పను బ్రదర్‌' అంటూ అభిమానుల మధ్య విభేదాలకు ఆజ్యం పోశాడు బన్నీ. ఆ తర్వాత పవన్‌ ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియా సాక్షిగా ఎంత గొడవ జరిగిందో తెలిసిందే.

English summary
Ram Gopal Varma ‏ tweeted: There genuinely is no other leader than Pawan Kalyan in entire Andhra Pradesh...His Fieriness is his POWER and his Sincerity is his STAR, Just watched entire P K speech nd realised that he very deeply understands what he is talking about nd his 3 levelled fight is very correct.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu