»   » అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను: రామ్ గోపాల్ వర్మ

అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మకు వివాదాలతో ఇతరులను ఏడిపించడం మాత్రమే తెలుసని అంతా అనుకుంటారు. కానీ ఆయన కూడా వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయంటే నమ్ముతారా? తాజాగా తన బయోగ్రఫీని ‘గన్స్ అండ్ థైస్' పేరుతో విడుదల చేసిన వర్మ తన జీవితంలో ఏడుపు ఆపుకోలేక పోయిన సందర్భాన్ని ఈ పుస్తకంలో వివరించారు.

తాను దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్ధ్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాకయ్యాను అని, ఎందుకో అప్పుడు ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను అని రామ్ గోపాల్ వర్మ తన బయోగ్రఫీ ‘గన్ష్ అండ్ థైస్'లో వివరించారు.

అమితాబ్ గురించి...
వర్మ దర్వకత్వంలో వచ్చిన 'ఆగ్‌', 'నిశ్శబ్‌'చితాల్లో మాత్రం అమితాబ్‌ పాత్రలకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి తాజాగా తాను రాసిన'గన్స్‌ అండ్‌ థైస్‌' పుస్తకంలో వివరణ ఇచ్చారు వర్మ. అందులో 'మై లవ్‌ ఎఫైర్‌ విత్‌ అమితాబ్‌ బచ్చన్‌' పేరిట ఓ అధ్యాయంలో అమితాబ్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.

RGV cried uncontrollably when he heard Jiah Khan's suicide

''అమితాబ్‌ను ఓ స్టార్‌గానే చూసిన నేను ఆయనలోని నటుణ్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలనుకున్నాను. అందుకే 'ఆగ్‌', 'నిశ్శబ్ద్‌'ల్లో ఆయన పాత్రలతో ప్రయోగం చేశాను. నాపై పూర్తివిశ్వాసంతో, అమితాబ్‌ ఆ పాత్రలు చేశారు. అలాంటి వాటికి అమితాబ్‌ను ఎంచుకోవడం తప్పని ఆ తర్వాతే అర్థమైంది. నటుడిగా అమితాబ్‌ ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయనలోని ప్రతిభను సరిగా ఆవిష్కరించలేకపోయిన నా లాంటి దర్శకులదే తప్ప''ని రాసుకొచ్చారు వర్మ.

ఇప్ప‌టికే ఈ బుక్‌ని అమితాబ్‌, ఊర్మిత‌తోపాటు ప‌లువురి గ్యాంగ్‌స్ట‌ర్స్‌, పోర్న్ స్టార్ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు వర్మ. ద‌ర్శ‌కుడిగా తాను ఎంట్రీ ఇవ్వ‌డానికి అమితాబ్‌, శ్రీదేవే కార‌ణ‌మ‌ని చెప్పాడు వ‌ర్మ‌. దీవార్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ గ‌న్‌ని, హిమ్మ‌త్‌వాలాలో శ్రీదేవి తొడ‌ల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ అయ్యి డైరెక్ట‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని వివ‌రించాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అందుకే ‘గ‌న్స్ అండ్ థైస్'(గన్స్ మరియు తొడలు) పేరుతో బయోగ్రఫీ రాసుకున్నాడు.

అయితే శ్రీదేవి తొడల గురించి వర్మ అలా రాయడాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ తప్పుబట్టారు. దీకి వర్మ స్పందిస్తూ బోనీ కపూర్ నాపై విమర్శలు చేసే ముందు ‘గన్స్ అండ్ థైస్' పుస్తకం పూర్తిగా చదవాలని సూచించాడు వర్మ. భర్తగా బోనీ కపూర్ శ్రీదేవికి ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఒక అభిమానిగా నేను ఇచ్చే రెస్పెక్టే గొప్పదని వర్మ పేర్కొన్నాడు. శ్రీదేవి అంత పాపులర్ కావడానికి కేవలం ఆమె యాక్టింగ్ కెపాసిటీ మాత్రమే కాదు...ఆమె అందమైన తొడలు కూడా కారణమని వర్మ చెప్పారు. కేవలం యాక్టింగు టాలెంటుతో స్టార్ డమ్ వస్తుందనుకుంటే స్మితా పాటిల్ శ్రీదేవి కంటే ఎందుకు పెద్ద స్టార్ కాకపోయింది. శ్రీదేవి అందమైన తొడలే ఆమెను పెద్ద స్టార్ ను చేసాయి. శ్రీదేవి తొడలు, ఆమె నవ్వు, ఆమె యాక్టింగ్ టాలెంట్, ఆమె సెన్సివిటీ అన్నింటినీ నేను గౌరవిస్తాను అని వర్మ పేర్కొన్నాడు.

English summary
Director Ram Gopal Varma cried uncontrollably when he heard Jiah Khan's suicide news.
Please Wait while comments are loading...